Joe Biden: బైడెన్ పనైపోయింది.. ఆయన ఎక్కువకాలం పదవిలో కొనసాగలేరు.. రోనీ జాక్సన్ సంచలన వ్యాఖ్యలు..
మెరికా అధ్యక్షుడు జో బైడెన్ వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నాడు, ఆయన మైండ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఎక్కువ కాలం అధ్యక్ష పదవిలో కొనసాగలేడు అంటూ వైట్ హౌస్ మాజీ ఫిజీషియన్ రోనీ జాక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Harish Thanniru
- Published on- July 17, 2022 / 03:11 PM IST
Jobaiden
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నాడు, ఆయన మైండ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఎక్కువ కాలం అధ్యక్ష పదవిలో కొనసాగలేడు అంటూ వైట్ హౌస్ మాజీ ఫిజీషియన్ రోనీ జాక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
బైడెన్ విషయంలో ఇంకా ఎక్కువ సమయం వేచి చూడకూడదు. బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. శ్వేతసౌధంలో గొప్ప బాధ్యతలు నిర్వహించి ఇలా అమర్యాదగా ప్రవర్తించడం సబబు కాదంటూ.. ఒరాక్ ఒబామా తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోనీ వెల్లడించారు.
Joe Biden: సైకిల్ తొక్కుతూ కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. వీడియో వైరల్..
బైడెన్ పలువురు అమెరికా మాజీ అధ్యక్షులకు వ్యక్తిగత ఫిజీషియన్ గా సేవలందించారు. ఒరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జార్జ్ డబ్ల్యూ బుష్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. రోనీ ప్రస్తుతం టెక్సాస్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
