Viral Video: కవాతుకు అడ్డొచ్చిన చిన్నారి కాలును తొక్కిన సైనికుడు
కవాతు చేస్తున్న సైనికుడొకరు, తనకు అడ్డొచ్చిన చిన్నారి కాలు తొక్కుకుంటూ వెళ్లిపోయిన దారుణ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.
- Bharath Reddy
- Published On : December 30, 2021 / 05:04 PM IST
Guard
Viral Video: కవాతు చేస్తున్న సైనికుడొకరు, తనకు అడ్డొచ్చిన చిన్నారి కాలు తొక్కుకుంటూ వెళ్లిపోయిన దారుణ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. సైనికుడి బూటు కింద నలిగి చిన్నారి రోదించిన తీరు అందరిని కలచివేయగా.. సైనికుడి తీరు విమర్శలకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ లోని లండన్ టవర్ వద్ద ప్రతి రోజు సైనికులు పహారా కాస్తుంటారు. కోల్డ్ స్ట్రీం గార్డ్(Coldstream Guard)గా పిలువబడే వీరు బ్రిటన్ రాయల్ కుటుంబానికి రక్షణగా ఉంటారు. లండన్ టవర్ వద్ద ప్రతిరోజూ వీరు చేసే కవాతును వీక్షించేందుకు వందల మంది పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. ఇటీవల అక్కడ పర్యటనకు వచ్చిన ఓ కుటుంబం సైనికుక్లుక్ చేస్తున్న కవాతును వీడియో తీసింది. అదే సమయంలో కుటుంబానికి చెందిన చిన్నారి కవాతు చేస్తున్న సైనికులకు అడ్డుగా వెళ్ళి, కిందపడిపోయింది. కవాతు మధ్యలో ఉండగా చిన్నారిని గమనించని సైనికుడు, ఆమె కాలు తొక్కకుని ముందుకు వెళ్ళిపోయాడు.
Also read: Jinnah Tower in Guntur: జిన్నా టవర్ చరిత్ర ఏమిటి?
సైనికుడి బూటుకాలు క్రింద నలిగి చిన్నారి నొప్పితో ఎంతో బాధపడింది. ఇక ఈఘటనను వీడియో తీసిన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అది చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మంచికి, సహనానికి మారుపేరుగా చెప్పుకునే సైనికుడు, ఆ చిన్నారిని పట్టించుకోకపోవడం ధారుణమంటూ కొందరు కామెంట్ చేయగా.. చిన్నారిదే తప్పు అంటూ మరికొందరు కామెంట్ చేసారు. అయితే, కవాతు ముగిసిన అనంతరం ఆ సైనికుడు తిరిగి వచ్చి ఆ చిన్నారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు.
Also Read: Vijayawada Crime: బెజవాడలో రెచ్చిపొతున్న గంజాయి గ్యాంగ్, మహిళల ఆందోళన
