Jinnah Tower in Guntur: జిన్నా టవర్ చరిత్ర ఏమిటి?

పాకిస్తాన్ జాతిపితగా పిలువబడే మహమ్మద్ అలీ జిన్నా పేరు మీదుగా ఏర్పాటు చేసిన ఈ స్తూపం ఇక్కడ ఎందుకు ఉంది, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి

Jinnah Tower in Guntur: జిన్నా టవర్ చరిత్ర ఏమిటి?

Jinnah

Jinnah Tower in Guntur: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో “జిన్నా టవర్” అనే స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేశ విభజనకు కారణమైన జిన్నాకు సంబంధించిన స్తూపం పేరును మార్చాలని లేదంటే అసలు స్తూపాన్నే తొలగించాలని భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ జాతిపితగా పిలువబడే మహమ్మద్ అలీ జిన్నా పేరు మీదుగా ఏర్పాటు చేసిన ఈ స్తూపం ఇక్కడ ఎందుకు ఉంది, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో కొందరికి మాత్రమే తెలుసు. రాజకీయంగా ఇప్పుడు కాకరేపుతున్న ఈ జిన్నా టవర్ ఏర్పాటు వెనుకనున్న చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

భారత స్వాతంత్య్రనికి పూర్వం భారత్ పాకిస్తాన్ లు కలిసే ఉండేవన్న సంగతి తెలిసిందే. అప్పట్లో బ్రిటిష్ పాలనలో నలుగుతుండేవి. దేశ స్వాతంత్రం కోసం అనేకమంది నేతలు పోరాడుతున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహమ్మద్ అలీ జిన్నా కూడా పాల్గొన్నారు(కొంత కాలం తరువాత ప్రత్యేక దేశం కావాలంటూ డిమాండ్ చేసారు). జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు లక్షల మంది బ్రిటిషు వారితో పోరాడుతున్నారు. క్విట్ ఇండియాలో భాగంగా పోరాటం ఉదృతంగా సాగుతున్న సమయంలో 1942లో గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న లాల్ జాన్ బాషా..మొహమ్మద్ ఆలీ జిన్నాతో గుంటూరులో భారీ సభ నిర్వహించాలని తలపించారు. బొంబాయి వెళ్లి జిన్నాను కూడా ఆహ్వానించారు. సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేయగా, చివరి నిముషంలో జిన్నా సభకు హాజరు కాలేదు. జిన్నా స్థానంలో జిన్నా సన్నిహితుడు జుదా లియాఖత్ అలీఖాన్ ఈసభకు హాజరు అయ్యారు. అయితే సభకు జిన్నా వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా స్మారక స్తూపాని ఆవిష్కరించాలని లాల్ జాన్ బాషా ఆకాంక్షించారు. జిన్నా రాకపోవడంతో సభకు వచ్చిన అప్పటి స్వాతంత్య్ర సమరయోధులు ఈ స్తూపాన్ని ఆవిష్కరించి వెళ్లిపోయారు. ఆనాటి నుంచి గుంటూరు నగరంలో ఈ స్తూపం ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది.

Also Read: Vijayawada Crime: బెజవాడలో రెచ్చిపొతున్న గంజాయి గ్యాంగ్, మహిళల ఆందోళన

గుంటూరు నగరంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఈ టవర్ సమీపంలో అనేక వ్యాపార సముదాయాలు ఏర్పాటు అయ్యాయి. స్వాతంత్య్రం పూర్వం నుంచి ఇక్కడ అన్ని మతాలవారు స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. ఇప్పటి వరకు ఇబ్బంది లేని వ్యవహారంపై నేతలు రాజకీయం చేయడం తగదంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.

Also read: Weed sale made him Millionaire: జాబ్ వదిలేసి “మరిజువానా” సాగుతో కోట్లు సంపాదిస్తున్న యువకుడు