New York : భూమిలోకి కుంగిపోతున్న న్యూయార్క్ నగరం.. ఎందుకో తెలుసా?

న్యూయార్క్ లో దాదాపు 10లక్షలకు పైగా ఆకాశాన్ని తాకే భవనాలు ఉన్నాయి. వీటి బరువు సుమారుగా 76,200 కోట్ల కిలోలు ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

New York Sinking Ground : అమెరికాలోని న్యూయార్క్ నగరం క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. న్యూయార్క్ నగరం మెల్ల మెల్లగా భూమిలోకి కుంగిపోతోందని తాజా అధ్యయనం పేర్కొంది. అయితే నగరంలో ఆకాశాన్ని తాకేట్టు నిర్మించిన భవన నిర్మాణాలు, పెద్ద ఎత్తున భూగర్భజలాల వినియోగం ఇందుకు కారణమని స్పష్టం చేసింది.ఈ అధ్యయనంలోని అంశాలను ఎర్త్స్ ఫ్యూచర్ సైన్స్ జర్నల్ తాజాగా ప్రచురించింది.

న్యూయార్క్ లో దాదాపు 10లక్షలకు పైగా ఆకాశాన్ని తాకే భవనాలు ఉన్నాయి. వీటి బరువు సుమారుగా 76,200 కోట్ల కిలోలు ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. భూ ఉపరితలంపై ఒత్తిడి ఏర్పడి నగరం ఏటా సగటున 1 నుంచి 2 మిల్లీ లీటర్లు భూమిలోకి కుంగిపోతుందని, పలు చోట్ల భవనాలు 2 అడుగుల మేర కుంగిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు.

Joshimath Sinking : కుంగిపోతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు.. జోషిమఠ్‌లో ఈ భయానక పరిస్థితులకు కారణమిదే..!

సుముద్రమట్టం క్రమంగా పైకి వస్తోన్న సంగతిని శాటిలైట్ ఫొటోలు చెబుతున్నాయి. భారీ తుపాన్లు వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. నగరానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధ్యయనంలో సహ రచయిత టాప్ పార్సన్స్ తెలిపారు. మన్ హట్టన్, బ్రూక్లీన్, క్వీన్స్ ప్రాంతాలు భూమిలో కుంగిపోతున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు