Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి సిద్ధమైన బిలియనీర్.. పెళ్లికూతురు వయసు ఎంతంటే?
మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియాన్ - అమెరికన్ వ్యాపారవేత్త, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ తన 92ఏళ్ల వయస్సులో ఐదో వివాహం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకుముందు నలుగురికి విడాకులు ఇచ్చిన ఆయన.. తన ప్రేయసి ఆన్ లెస్లీ స్మిత్ ను వివాహం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. వీరి ఎంగేజ్‌మెంట్ ఈనెల 17న జరిగింది.
- Harishth Thanniru
- Published On : March 21, 2023 / 10:44 AM IST
Rupert Murdoch
Rupert Murdoch: ప్రపంచ మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియన్ – అమెరికన్ వ్యాపారవేత్త, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) తన 92ఏళ్ల వయసులో ఐదవసారి పెళ్లిచేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే నలుగురికి విడాకులు ఇచ్చిన బిలియనీర్ ( Billionaire) తాజాగా తన ప్రేయసి 66ఏళ్ల ఆన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith) అనే మహిళను పెళ్లిచేసుకోబోతున్నట్లు తన సొంత వార్తాపత్రిక న్యూయార్క్ పోస్ట్ ((New York Post) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, మీడియా కథనం ప్రకారం.. రూపర్ట్ మర్దోక్, ఆన్‌లెస్లీ స్మిత్‌కు ఈనెల 17న న్యూయార్క్‌లో ఎంగేజ్మెంట్ (Engagement) జరిగింది. ఎంగేజ్మెంట్ సమయంలో తనకు ఇది చివరి పెళ్లి అని, నాకు చాలా సంతోషంగా ఉందని మర్దోక్ చెప్పినట్లు సమాచారం. వీరి వివాహం త్వరలో జరుగుతుందని, వీరు తమ సమయాన్ని యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ లో గడిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Rupert Murdoch divorce : 91 ఏళ్ల వయసులో మీడియా మొఘల్ 4వ విడాకులు..
మర్దోక్ మొదట పెట్రిసియా బుకర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 1960 చివరిలో ఆమెకు విడాకులు ఇచ్చాడు, ఆ తరువాత అన్నా మరియా మన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె వార్తాపత్రిక రిపోర్టర్. వీరిద్దరు 30ఏళ్లకుపైగాకు కలిసి జీవించారు. 1999లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత వెండీ డెంగ్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2013లో విడాకులు ఇచ్చాడు. 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్న మర్దోక్ గతేడాది ఆగస్టు నెలలో ఆమెకుసైతం విడాకులు ఇచ్చాడు. తాజాగా 92ఏళ్ల వయస్సులో తన ప్రియురాలు ఆన్ లెస్లీ స్మిత్‌ను ఐదో వివాహం చేసుకొనేందుకు మర్దోక్ సిద్ధమయ్యాడు.
Old Man Married To Girlfriend: ప్రేమంటే అంతేమరి..! 93ఏళ్ల వయస్సులో ప్రియురాలిని పెళ్లాడిని వ్యోమగామి
ఇదిలాఉంటే.. విడాకులు ఇచ్చే సమయంలో రెండో వివాహం చేసుకున్న మన్‌కు భారీగా భరణం ఇచ్చాడు. 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మర్దోక్ వివాహం చేసుకోనున్న ఆన్‌లెస్లీ స్మిత్ భర్త కూడా ప్రముఖ వ్యక్తి. 2009లో ఆయన చనిపోయాడు. ఆ తరువాత కొద్దికాలంకు వీరిమధ్య ప్రేమ చిగురించింది. చివరకు 66ఏళ్ల ఆన్‌లెస్లీ స్మిత్ 94ఏళ్ల వయస్సు కలిగిన మర్దోక్‌ను వివాహం చేసుకోనుంది.
