Rupert Murdoch divorce : 91 ఏళ్ల వయసులో మీడియా మొఘల్ 4వ విడాకులు..

మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తన 91 ఏళ్ల వయసులో తన నాలుగో విడాకులకు సిద్ధమవుతున్నారు. బిలియనీర్, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 91 ఏళ్ల వయసులో 65 ఏళ్ల నటి జెర్రీ హాల్ తో మర్డోక్ విడాకులు తీసుకుంటున్నారు.

Rupert Murdoch divorce : 91 ఏళ్ల వయసులో మీడియా మొఘల్ 4వ విడాకులు..

At 91, Media Mogul Heading For 4th Divorce

Rupert Murdoch divorce : కొంతమంది ఎంత వయస్సు వచ్చినా ఇంకా కుర్రాళ్లలాగే వ్యవహరిస్తుంటారు. పెళ్లిళ్లు చేసుకోవటం విడాకులు తీసుకోవటంలో సెలబ్రిటీలు ఎలా వార్తల్లోకి వస్తుంటారో తెలిసిందే. అటువంటి మరో దిగ్గజం తన 91వ ఏటా నాలుగవ విడాకులు తీసుకోవటానికి సిద్ధమైపోయారు. ఆయనే బిలియనీర్, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్. రూపర్ట్ తన 91 ఏళ్ల వయసులో తన నాలుగో విడాకులకు సిద్ధమవుతున్నారు. బిలియనీర్, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 91 ఏళ్ల వయసులో 65 ఏళ్ల నటి జెర్రీ హాల్ తో మర్డోక్ విడాకులు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఆరేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పేందుకు ఈ వృద్ధ జంట సిద్ధమవుతున్నారట. ఈ జంట విడిపోవడం “కుటుంబానికి సన్నిహితులకు ఆశ్చర్యం కలిగిస్తుంది” అని నివేదిక పేర్కొంది.

Bill Gates: బిల్ గేట్స్ దంపతుల సంచలన నిర్ణయం.. 27ఏళ్ల వైవాహిక జీవితంలో విడాకులు

1956 ఆస్ట్రేలియన్ ఫ్లైట్ అటెండెంట్ ప్యాట్రిసియా బుకర్‌తో ముర్డోక్ మొదటి వివాహం జరిగింది. ఇది 1967లో ఆ పెళ్లి ముగిసింది. తర్వాత అతను అన్నా మారియా టోర్‌ను రెండవసారి వివాహం చేసుకున్నాడు. ఈవివాహం 1967 నుండి 1999 వరకు కొనసాగింది. ఆ తరువాత రూపర్ట్ మర్డోక్ వెండీ 1999లో డెంగ్‌ను మూడవసారి వివాహం చేసుకున్నాడు.. అది 2013 వరకు కొనసాగింది.

2016లో మర్డోక్ ‘బ్యాట్‌మాన్’, ‘ది గ్రాడ్యుయేట్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన జెర్రీ హాల్‌ను మర్డోక్ వివాహం చేసుకున్నారు. (జెర్రీ హాల్ మర్డోక్ ను వివాహం చేసుకోకముందు  రోలింగ్ స్టోన్స్ ఫ్రంట్‌మ్యాన్ మిక్ జాగర్‌ను వివాహం చేసుకుంది, ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు). ఫాక్స్ న్యూస్ ఛానల్, న్యూస్ కార్ప్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇవన్నీ మర్డోక్ కు చెందిన వార్తా సంస్థలు. న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్ లో కుటుంబ ట్రస్ట్ ద్వారా మర్డోక్ 40 శాతం వాటా కలిగి ఉన్నారు. జెర్రీ హాల్, రూపర్ట్ ముర్డోక్‌లకు వేర్వేరు వివాహాల నుండి 10 మంది పిల్లలు ఉన్నారు. మర్డోక్ తన నాలుగవ వివాహంతో చాలా సంతోషంగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడిగా, సంతోషంగా ఉన్న వ్యక్తిగా తాను కనిపిస్తున్నానని అప్పట్లో ఆయన ప్రకటించారు. కానీ ఇంతలోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Google Co-Founder: బిల్‌గెట్స్, జెఫ్ బెజోస్ బాటలో సెర్జీబ్రిన్ దంపతులు.. ఏం చేస్తున్నారంటే..

కాగా..ఈ విడాకుల కథనంపై ఇటు మర్డోక్ అధికార ప్రతినిధి కానీ..అటు 65 ఏళ్ల హాల్ ప్రతినిధుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందనా రాలేదు. మర్డోక్, హాల్ ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నవారే. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మర్డోక్ నెట్ వర్క్ 17.7 బిలియన్ డాలర్లు. సుమారు రూ.1.80 లక్షల కోట్లు.