Google Co-Founder: బిల్‌గెట్స్, జెఫ్ బెజోస్ బాటలో సెర్జీబ్రిన్ దంపతులు.. ఏం చేస్తున్నారంటే..

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన సెర్జీ బ్రిన్ దంపతులు బిల్ గెట్స్, జెఫ్ జెజోస్ దంపతుల బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. సెర్జీ బ్రిన్ ఆయన భార్య నికోల్ షనాహన్ లు తమ వివాహ బంధానికి స్వస్థి చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. సెర్జీ బ్రిన్ ఈ నెలలో న్యాయస్థానంలో పిటిషన్ సైతం దాఖలు చేశారు. వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతుండటంతో మూడేళ్లలో ప్రపంచ కుబేరుల్లో విడాకులు తీసుకొనే జంటగా వీరు వార్తల్లో నిలుస్తున్నారు.

Google Co-Founder: బిల్‌గెట్స్, జెఫ్ బెజోస్ బాటలో సెర్జీబ్రిన్ దంపతులు.. ఏం చేస్తున్నారంటే..

Google Co Founder

Google Co-Founder: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన సెర్జీ బ్రిన్ దంపతులు బిల్ గెట్స్, జెఫ్ జెజోస్ దంపతుల బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. సెర్జీ బ్రిన్ ఆయన భార్య నికోల్ షనాహన్ లు తమ వివాహ బంధానికి స్వస్థి చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. సెర్జీ బ్రిన్ ఈ నెలలో న్యాయస్థానంలో పిటిషన్ సైతం దాఖలు చేశారు. వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతుండటంతో మూడేళ్లలో ప్రపంచ కుబేరుల్లో విడాకులు తీసుకొనే జంటగా వీరు వార్తల్లో నిలుస్తున్నారు.

Bill Gates: బిల్ గేట్స్ దంపతుల సంచలన నిర్ణయం.. 27ఏళ్ల వైవాహిక జీవితంలో విడాకులు

గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ (49), నికోల్ షనాహన్ (37)లు 2018లో ఒక్కటయ్యారు. వీరికి మూడుళ్ల కుమార్తె కూడా ఉంది. వీరి మధ్య మనస్పర్ధల కారణంగా 2021 నుంచి విడివిడిగా ఉంటున్నారు. తాజాగా వీరు విడాకులు తీసుకొనేందుకు కోర్టును ఆశ్రయించారు. హై ప్రొఫైల్ కేసు కావడం, వీరి విడాకులపై ప్రజల్లో ఆసక్తి ఉండటంతో పాటు చిన్నారి కస్టడీ గురించి వివరాలు బయటకు పొక్కే ఆస్కారం ఉండటంతో వీరి విడాకుల విషయంపై పూర్తి గొప్యత పాటించేందుకు ఈ జంట చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Basara IIIT Students: వెనక్కి తగ్గిన విద్యార్థులు.. మంత్రి హామీతో ఆందోళన విరమణ

ప్రపంచ కుబేరుల్లో సెర్జీ బ్రిన్ 6వ స్థానంలో ఉన్నారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. సెర్జీ బ్రిన్ సంపద సుమారు రూ. 7లక్షల కోట్లు. సెర్జీ బిన్ కు షనాహన్ రెండవ భార్య. 2007లో అన్నే వొజిస్కీని బ్రిన్ వివాహం చేసుకున్నారు. 2015లో వీరిద్దరు విడిపోయారు. వీరికి ఇద్దరు సంతానం. 2018లో షనాహన్ ను సెర్జీ బ్రిన్ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. 2021 సంవత్సరం నుంచి మనస్పర్ధల కారణంగా వీరు వేరువేరుగా ఉంటున్నారు. తాజాగా వీరు విడాకులు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం సెర్జీ బ్రిన్ జంట ప్రైవేట్ న్యాయమూర్తిని ఎంపిక చేసుకోవడంతో విడాకులకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు తెలిసే అవకాశాలు తక్కువనేనని తెలుస్తుంది.