Bill Gates: బిల్ గేట్స్ దంపతుల సంచలన నిర్ణయం.. 27ఏళ్ల వైవాహిక జీవితంలో విడాకులు

ప్రపంచ బిజినెస్ టైకూన్ బిల్‌గేట్స్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య మిలిండా గేట్స్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు...

Bill Gates: బిల్ గేట్స్ దంపతుల సంచలన నిర్ణయం.. 27ఏళ్ల వైవాహిక జీవితంలో విడాకులు

Bill Gates

Bill Gates: ప్రపంచ బిజినెస్ టైకూన్ బిల్‌గేట్స్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య మిలిండా గేట్స్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు.

ఎన్నో ఆలోచనలు, ఎంతో లోతుగా సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించినా… ఎంతకీ కుదరకపోవడంతో… ఇక తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నామన్నారు.

ఈ విషయాన్ని బిల్ గేట్స్ దంపతులు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాము విడిపోయినా, బిల్ గేట్స్ ఫౌండేషన్ మాత్రం విడిపోదని, ఇద్దరం కలిసి కట్టుగానే ఫౌండేషన్ ను నడిపిస్తామని తెలిపారు. తమకు ముగ్గురు పిల్లలు పుట్టారనీ… ఓ మంచి స్వచ్ఛంద సంస్థ (మిలిండా గేట్స్ ఫౌండేషన్)ను స్థాపించామని చెప్పారు. ఆ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ… ప్రజల ఆరోగ్యం, నాణ్యమైన జీవితాల కోసం కృషి చేస్తోందని వివరించారు.

మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేసిన తరువాత 1987 మిలిందా మైక్రోసాఫ్ట్ కంపెనీ లో జాయిన్ అయ్యారు. ఆ తరువాత 1994 లో బిల్ గేట్స్, మిలిందా గేట్స్ లు వివాహం చేసుకున్నారు. 54 బిలియన్ డాలర్ల విలువైన గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. ఫౌండేషన్ విషయంలో ఎలాంటి విబేధాలూ లేకుండా ఇకపైనా కలిసే పనిచేస్తామనీ… సంస్థను కొనసాగిస్తామని తెలిపారు.

బిల్ గేట్స్ నుంచి వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని ప్రపంచ ఆర్థిక వేత్తలు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యపోతున్నారు.