Russia: సొలెడార్‌ను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా.. తమ ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్
తాజాగా యుక్రెయిన్‌లోని పశ్చిమ నగరమైన సొలెడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, రష్యా ప్రకటనను యుక్రెయిన్ ఖండించింది. రష్యా ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే యుక్రెయిన్ మరో ప్రకటన చేసింది.
- Narender Thiru
- Published On : January 13, 2023 / 08:52 PM IST
Russia: దాదాపు ఏడాది కాలంగా సాగుతున్న రష్యా–యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి వాస్తవాలు వెలుగు చూడటం లేదు. రష్యా, యుక్రెయిన్.. రెండు దేశాలూ యుద్ధానికి సంబంధించి తమకు అనుకూలమైన ప్రకటనలు చేసుకుంటున్నాయి.
తాజాగా యుక్రెయిన్‌లోని పశ్చిమ నగరమైన సొలెడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, రష్యా ప్రకటనను యుక్రెయిన్ ఖండించింది. రష్యా ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే యుక్రెయిన్ మరో ప్రకటన చేసింది. సొలెడార్ నగరం రష్యా స్వాధీనం కాలేదని, ఇంకా తీవ్ర యుద్ధం కొనసాగుతోందని ప్రకటించింది. అయితే, ఈ పట్టణం ఇప్పటికే చాలా వరకు ధ్వంసమైంది. యుద్ధం ప్రారంభమైన ఇంతకాలం తర్వాత ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించగా, ఈ నగరం ఇంకా తమ ఆధీనంలోనే ఉందని యుక్రెయిన్ చెప్పింది.
MS Dhoni: గత వరల్డ్ కప్ తర్వాతే రిటైర్ కావాలకున్న ధోనీ.. వెల్లడించిన మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్
యుక్రెయిన్‌పై విజయం సాధించాలంటే రష్యాకు ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది యుక్రెయిన్‌లోని డోనెస్క్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం స్వాధీనమైతే యుక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే, ఈ నగరానికి సంబంధించి అమెరికా అంచనా ప్రకారం దీనికి అంతగా ప్రాధాన్యం లేదు. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా పై చేయి సాధించవచ్చని యుక్రెయిన్ భావిస్తోందని, కానీ, ఈ అంచనా సరికాదని అమెరికా అభిప్రాయం.
