Russia Attack Ukraine: రష్యా, యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్స్ కి చేరాయి. యుక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేసింది. ఒక్కరోజే ఏకంగా 472 డ్రోన్లు ప్రయోగించింది. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై మూడేళ్లు అవుతోంది. ఈ మూడేళ్లలో ఇదే అతి పెద్ద దాడి అని యుక్రెయిన్ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే రష్యా తమపై 472 డ్రోన్లు ప్రయోగించిందని యుక్రెయిన్ వైమానిక దళం ఆదివారం తెలిపింది.
యుక్రెయిన్ మీదుగా 472 డ్రోన్లను ప్రయోగించింది. డ్రోన్ల దాడితో పాటు రష్యా దళాలు ఏడు క్షిపణులను కూడా ప్రయోగించాయి అని యుక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. సోమవారం రష్యాతో కొత్త రౌండ్ ప్రత్యక్ష శాంతి చర్చల కోసం యుక్రెయిన్ ఒక ప్రతినిధి బృందాన్ని ఇస్తాంబుల్‌కు పంపుతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ తెలిపారు. “మా స్వాతంత్ర్యాన్ని, మా దేశాన్ని, మా ప్రజలను రక్షించుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము” అని జెలెన్ స్కీ చెప్పారు.
ఆదివారం ఉదయం యుక్రెయిన్ సైన్యం ఒక సైనిక యూనిట్‌ను తాకింది. ఉక్రెయిన్ సైన్యం ఒక సైనిక శిక్షణా యూనిట్‌పై రష్యా క్షిపణి దాడిలో కనీసం 12 మంది ఉక్రెయిన్ సర్వీస్ సభ్యులు మరణించారని మరియు 60 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.
యుక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా క్షిపణి దాడులు చేసింది. రష్యా జరిపిన దాడిలో 12మంది మృతి చెందారు. 60 మందికిపైగా గాయపడ్డాడు. యుక్రెయిన్ పై రష్యా ఏకంగా 472 డ్రోన్లను ప్రయోగించిందని.. వాటిలో 385 డ్రోన్లను అడ్డుకున్నట్లు యుక్రెయిన్ తెలిపింది.