Russia – Ukraine: రష్యా – ఉక్రెయిన్ ఉద్రిక్తతలు భారత ఎంబసీ మరో ప్రకటన

రెండ్రోజులుగా రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కీవ్ లోని భారత ఎంబసీ అక్కడే ఉన్న భారతీయుల నిమిత్తం కీలక ప్రకటన చేసింది.

Russia – Ukraine: రెండ్రోజులుగా రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కీవ్ లోని భారత ఎంబసీ అక్కడే ఉన్న భారతీయుల నిమిత్తం కీలక ప్రకటన చేసింది.

‘రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఉక్రెయిన్ లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఉక్రెయిన్ లోని భారత విద్యార్థుల కోసం అప్రమత్తంగా ఉన్నాం. భారత్ – ఉక్రెయిన్ మధ్య విమాన సర్వీసుల పెంపు పై చర్చలు జరుపుతున్నాం’ అని కీలక ప్రకటన చేసింది.

ఉక్రెయిన్‌లోని భారత పౌరుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్లు, ఈ మెయిల్ వంటి ఏర్పాట్లు చేశారు. కీవ్ లోని భారత ఎంబసీ కార్యాలయంలో, విదేశాంగ శాఖ కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటైయ్యాయి.

ఎంబసీ హెల్ప్‌లైన్ నెంబర్లు:
+380 997300483
+380 997300428
email: cons1.kyiv@mea.gov.in

Read Also : ఉక్రెయిన్ – రష్యా ఉద్రిక్తతలు… అప్రమత్తమైన భారత్

ట్రెండింగ్ వార్తలు