Imran Khan : ‘మీరు చెప్పినట్లుగా చేయటానికి పాకిస్థాన్ మీకు బానిసా..?’ పాక్ ప్రధాని ఫైర్

మీరు చెప్పినట్లుగా చేయటానికి పాకిస్థాన్ మీకు బానిసా? అంటూ పాశ్చాత్య దేశాల రాయబారులపై పాక్ ప్రధాని మండిపడ్డారు.

Imran Khan

Are We Your Slaves Pak PM Slams Western Envoys : యుక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ఖండించాలని పాకిస్తాన్‌ను కోరిన ఇస్లామాబాద్‌కు చెందిన పాశ్చాత్య దేశాల రాయబారులపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పాకిస్తాన్ ఏమన్నా మీకు “బానిస” అని భావిస్తున్నారా? అని వారిని ప్రశ్నించారు. యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులను పాకిస్థాన్ ఖండించాలంటూ గత వారం పాశ్చాత్య రాయబారులు ప్రధాని ఇమ్రాన్ ను కోరారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ… పాకిస్థాన్ మీకు బానిసా? అని అనుకుంటున్నారా? ఇలాంటి లేఖ మీరు భారత్ కు రాయగలరా?అని ప్రశ్నిస్తూ.. అని తీవ్రంగా మండిపడ్డారు.

Also read : Russia Ukraine War : శాంతి యుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోండి- జెలెన్‌స్కీ కి సూచించిన ప్రధాని మోదీ

ఈ సందర్భంలో, ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు UN జనరల్ అసెంబ్లీ రష్యాను తీవ్రంగా మందలించడంతో పశ్చిమ దేశాల సంప్రదాయ మిత్రదేశమైన పాకిస్థాన్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. కాగా..యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న క్రమంలో ఇమ్రాన్ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. పైగా రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధాన్ని ఇమ్రాన్ సమర్థించిన విషయం తెలిసిందే.

ఈక్రమంలో..యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు 22 దేశాల రాయబారులు ఈ నెల 1వ తేదీన ఒక సంయుక్త బహిరంగ లేఖను విడుదల చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మద్దతు పలకాలని లేఖలో పాకిస్థాన్ ను కోరారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు.

Also read : Rassia-Ukraine War : బాంబు దాడుల మధ్య..1,000 కిలోమీటర్లు ప్రయాణించిన 11 ఏళ్ల పిల్లాడు..శెభాష్ అన్న హోంమంత్రి

‘మా గురించి (పాకిస్థాన్) మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పిన విధంగా చేయడానికి మేమేమైనా మీ బానిసలా? ఇలాంటి లేఖను ఇండియాకు రాయగలరా అని యూరోపియన్ యూనియర్ రాయబారులను అడుగుతున్నా. మేము రష్యాకు స్నేహితులం. అమెరికాకు కూడా మిత్రులమే. మేము చైనా, యూరప్ లకు కూడా స్నేహితులమే. మేము ఏ ఒక్క వర్గంలోనే లేము. మేము తటస్థంగా ఉంటాం. ఉక్రెయిన్ లో యుద్ధం ఆపడానికి కృషి చేసే వారితో కలిసి పని చేస్తాం’ అని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. అఫ్ఘానిస్తాన్‌లో పాశ్చాత్య నాటో కూటమికి మద్దతివ్వడం వల్ల పాకిస్థాన్ నష్టపోయిందని..కృతజ్ఞతతో కాకుండా విమర్శలను ఎదుర్కొందని అన్నారు.