Russia Ukraine War Day-5 Live Updates : బెలారస్‌లో యుక్రెయిన్-రష్యా మధ్య చర్చలు

యుక్రెయిన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రజలకు తాము సహకరిస్తామని రష్యన్ ప్రభుత్వం తెలిపింది. ప్రజలు వెళ్లేందుకు వీలుగా సరిహద్దులను ఓపెన్ చేసినట్టు ప్రకటించింది. 

Russia Ukrain War Live Updates

Russia Ukraine War Day-5 Live Updates : రష్యా- యుక్రెయిన్ మధ్య వార్ ఐదోరోజు కొనసాగుతోంది. బెలారస్ బోర్డర్ లో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఫిబ్రవరి 28 సాయంత్రం 4 గంటల సమయంలో రష్యా-యుక్రెయిన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. మరోవైపు.. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధ ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యం మోహరింపు, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రజలకు తాము సహకరిస్తామని రష్యన్ ప్రభుత్వం తెలిపింది. ప్రజలు వెళ్లేందుకు వీలుగా సరిహద్దులను ఓపెన్ చేసినట్టు ప్రకటించింది.