Russian Fitness Influencer
Russian Fitness Influencer: “బింజ్ ఈటింగ్ చాలెంజ్” అంటూ రష్యాకు చెందిన ఓ ఫిట్‌నెస్ కోచ్, ఇన్‌ఫ్లుయెన్సర్ రోజుకు 10,000 కేలరీల జంక్ ఫుడ్‌ను తిన్నాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
రష్యాలోని ఒరెన్‌బర్గ్ నగరానికి చెందిన దిమిత్రీ నుయాంజిన్ (30) బరువు తగ్గించే ప్రోగ్రామ్‌ను ప్రమోట్ చేయడానికి ఈ చాలెంజ్‌లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ముందుగా భారీగా బరువు పెరగాలనుకున్నాడు. కనీసం 25 కిలోల బరువు పెరగడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
నుయాంజిన్ కొన్ని వారాల పాటు జంక్ ఫుడ్ తింటూ ఈ చాలెంజ్‌లో పాల్గొన్నాడు. రోజుకు 10,000 కేలరీలకుపైగా ఫుడ్‌ను తీసుకున్నాడు. ఇంతగా ఫుడ్ తినడం వల్ల తనలో వచ్చిన మార్పులకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు.
కొన్ని రోజుల క్రితం తాను అస్వస్థతకు గురయ్యానని స్నేహితులకు తెలిపాడు. శిక్షణ సెషన్లు రద్దు చేశాడు.. డాక్టర్‌ను కలుస్తానన్నాడు. అయితే, దిమిత్రీ నుయాంజిన్ నిద్రిస్తున్న సమయంలోనే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల మరణించాడు.
నుయాంజిన్ చివరిగా నవంబరు 18న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశాడు. లేస్ ప్యాక్ తింటూ కనిపించాడు. ఒక నెలలో 13 కిలోలు పెరిగానని, ఇప్పుడు 105 కిలోల బరువు ఉన్నానని తెలిపాడు.
ఇలాంటి చాలెంజ్ చేసే వారికి ఇది ఒక గుణపాఠమని సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. అతడు ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్‌కు పేస్ట్రీలు, కేక్.. లంచ్‌కు మయోనీజ్‌తో డంప్లింగ్స్.. డిన్నర్‌కు బర్గర్, రెండు చిన్న పిజ్జాలు తినేవాడు.