×
Ad

Child Abuse: వ్యూస్ కోసం దారుణం.. కొడుకుపైనే ప్రమాదకర ప్రయోగం చేసిన తల్లి.. జైల్లో వేయాలని డిమాండ్..

ఈ వీడియో తీవ్ర వివాదాస్పదం కావడంతో దాన్ని తొలగించింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Child Abuse: కన్న తల్లి అంటే.. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. వారికి చిన్న కష్టం కూడా కలగొద్దని ఆరాటపడుతుంది. ఎంతో ప్రేమగా పెంచుతుంది. పిల్లలకు చిన్న ఇబ్బంది కలిగినా తల్లి హృదయం విలవిలలాడిపోతోంది. అంత గొప్ప మనసు అమ్మది. అయితే, ఆమె మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏ తల్లి చేయని పని చేసింది. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దిగజారిపోయింది. కన్న కొడుకుపైనే ప్రమాదకర ప్రయోగం చేసి తీవ్ర విమర్శల పాలైంది.

పేరెంటింగ్ ప్రయోగం పేరుతో ఆమె వీడియో తీసింది. అందులో భాగంగా తన చిన్న కొడుకును ప్లాస్టిక్ బ్యాగ్‌లో వాక్యూమ్-సీల్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడామె చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొంటోంది.

ఆమె పేరు అన్నా సపరినా. వయసు 36 ఏళ్లు. రష్యాలోని సరటోవ్ లో ఉంటుంది. అన్నా సపరినా పేరెంటింగ్ ఇన్ ఫ్లుయన్సర్. ఆమె ఒక పేరెంటింగ్ బ్లాగ్ నడుపుతోంది. ఇటీవల ఆమె ఒక వీడియో తీసింది. ఆ వీడియో చాలా వివాదాస్పదమైంది. ఆమె తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. తన కొడుకును ఒక ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి, అందులో నుంచి గాలిని బయటకు పంపింది. దీంతో పిల్లాడు బాధతో విలవిలలాడాడు. అందులో ఉండలేక.. అమ్మా అంటూ కేకలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో చాలా కాంట్రవర్సీ అయ్యింది.

అసలు ఆమె తల్లేనా.. అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏ తల్లి కూడా తన బిడ్డను బాధ పెట్టదని.. ఈమె మాత్రం వ్యూస్ కోసం దిగజారిపోయిందని కసురుకుంటున్నారు. పిల్లాడిపై ప్రమాదకర ప్రయోగం చేసి అతడి ప్రాణాలతో చెలగాటం ఆడిన అన్నాను జైల్లో వేయాలని, కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ప్రముఖ పేరెంటింగ్ బ్లాగ్ ను నడుపుతున్న సపరినా పలు వీడియోలు తీయగా.. అందులో కొన్నింటికి మిలియన్ల వ్యూస్ ఉన్నాయి.

ఇది 47 సెకన్ల క్లిప్‌. ప్లాస్టిక్ గాలిని తొలగించడానికి ఆమె వాక్యూమ్ పంప్‌ను ఉపయోగించింది. ఈ వీడియో తీవ్ర వివాదాస్పదం కావడంతో దాన్ని తొలగించింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: గుడ్ న్యూస్.. భారత్‌లో స్టార్​లింక్​ ఇంటర్నెట్ ప్లాన్ల ధరలు ఇవే.. నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ఎంత? Sign-Up ఎలా? ఫుల్ డిటెయిల్స్..!