French President Emmanuel Macron with his wife Brigitte
Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కొంత విస్మయానికి గురవుతున్నారు. మెక్రాన్ తన భార్య చేతిలో తన్నులు తిన్నారనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ వీడియోపై రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా ఖజరోవా సెటైర్లు వేశారు. ఈ వీడియోలో తతంగాన్ని కవర్ చేయడానికి మెక్రాన్ సలహాదారులు క్రెమ్లిన్ హస్తం ఉందంటారేమో..? అంటూ ఎద్దేవా చేశారు.
అసలేం జరిగిందంటే..?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఆయన సతీమణి బ్రిగెట్టా ఆసియా పర్యటనలో భాగంగా వియత్నాం రాజధాని హనోయ్ కు చేరుకున్నారు. విమానం ల్యాండ్ అయిన తరువాత డోర్ ను ఒక అధికారి తెరచినప్పుడు మెక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే బ్రిగెట్టా చేతులతో మెక్రాన్ ముఖంపై కొట్టినట్టు కనిపించింది. అప్పటికే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు.. ఆమెతో గట్టిగా మాట్లాడుతున్నట్లు కూడా మెక్రాన్ కనిపించాడు. భార్య చేతులు తన మొహానికి తగలడంతో వెంటనే ఆయన తన తలను పక్కకు జరిపారు. ఆ తరువాత విమానం దిగే సమయంలో భార్య చేతిని పట్టుకోవడానికి మెక్రాన్ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు భర్తను బ్రిగెట్టా కొట్టిందని అంటుండగా.. మరికొందరు అలాంటిదేమీ అయుండదు అంటూ అభిప్రాయపడుతున్నారు.
రష్యా సెటైర్లు..
ఫ్రాన్స్ దంపతుల వీడియోపై రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా స్పందిస్తూ సెటైర్లు వేశారు. ‘‘ప్రథమ మహిళ తన భర్త చెంపమీద మెల్లగా తట్టి ఉత్సాహపరచాలనుకుంటే.. అనుకోకుండా చేయి వేగంగా వచ్చి ఉంటుందా..? కాలర్ సరిచేసే క్రమంలో పొరబాటున తన ప్రియమైన వ్యక్తి ముఖంపై చేయి తగిలిందా..? దీన్ని కవర్ చేయడానికి మెక్రాన్ సలహాదారులు క్రెమ్లిన్ హస్తం ఉందంటారేమో..?’’ అని ఎద్దేవా చేశారు.
మెక్రాన్ ఏమన్నారంటే..?
వీడియో వైరల్ అయిన తరువాత మెక్రాన్- బ్రిగ్గెట్టా మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయని ప్రెంచ్ మీడియాలో కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్ పై మెక్రాన్ స్పందిస్తూ.. తమ మధ్య ఎలాంటి గొడవ లేదు. అది తమ మధ్య జరిగిన సరదా సన్నివేశం. ఆ వీడియోలో నేను ఒక టిష్యూ తీసుకున్నాను. ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా భార్యతో జోక్ చేశాను. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగేదే’’ అని వివరణ ఇచ్చారు.
Macron, blink twice if you need help. pic.twitter.com/BRCEert9Rg
— End Wokeness (@EndWokeness) May 26, 2025