Russian Woman Who Protested Against War On Tv May Get 15 Years In Jail
Russia Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. యుక్రెయిన్ హస్తగతం చేసుకునేంతవరకు పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాల నుంచి సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. అధ్యక్షుడు పుతిన్ చర్యలను రష్యాన్లు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నినాదాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. రష్యాలోని ఓ ప్రభుత్వ ఆధారిత వార్తా ఛానెల్లో జర్నలిస్ట్ లైవ్‌లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. వార్తలు చదువుతూనే యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుని నిరసనను తెలియజేసింది.
యుద్ధం వద్దు.. యుద్ధాన్ని ఆపండి.. తప్పుడు ప్రచారాలను అసలు ఎవరూ నమ్మోద్దని ఆమె నిరసన వ్యక్తం చేసింది. రష్యా టీవీ జర్నలిస్టు నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పేరు మెరీనా ఓవ్స్యానికోవాగా.. ఛానెల్ 1లో ఎడిటర్‌గా పనిచేస్తోంది. మెరీనా తండ్రి యుక్రెయిన్ దేశస్థుడు కావడంతో ఆమె మద్దతుగా నిరసన వ్యక్తం చేసింది. రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసినందుకు మెరీనా ఓవ్‌స్యానికోవాకు 15ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. టీవీ జర్నలిస్టు మెరీనాను రష్యా పోలీసు అధికారులే అరెస్ట్ చేశారని నివేదికలు చెబుతున్నాయి.
A Russian state television employee who stormed a live broadcast Monday has been fined by a Moscow court for saying in a video that she was “deeply ashamed” to have helped make “Kremlin propaganda.” She still faces a prison sentence over the protest. https://t.co/fFmgkyvmP6 pic.twitter.com/wb2FanGFsa
— The New York Times (@nytimes) March 16, 2022
పోలీసులు అదుపులో ఉన్న మెరీనా అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను 14 గంటల పాటు విచారించారని, తన కుటుంబాన్ని సంప్రదించడానికి అనుమతించలేదని తెలిపింది. తాను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తనకు ఎలాంటి న్యాయపరంగా సాయం అందలేదని తెలిపింది. యుక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడం నాకు ఇష్టం లేకపోవడంతో నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది నిజంగా భయంకరమైనదని ఆమె పేర్కొంది. తనకు మద్దతు తెలిపిన స్నేహితులు, సహోద్యోగులకు ధన్యవాదాలు చెబుతున్నట్టు మెరీనా తెలిపింది. నా జీవితంలో నిజంగా కష్టతరమైన రోజులుగా పేర్కొంది. తాను రెండు రోజుల నుంచి సరిగా నిద్రపోలేదని, పద్నాలుగు గంటలకు పైగా పోలీసుల విచారణ కొనసాగిందని తెలిపింది. రష్యా మహిళా జర్నలిస్ట్ నిరసన విషయం తెలిసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Anti-war protester runs onto stage of one of Russia’s most-watched news programs, telling viewers: “Don’t believe the propaganda. You’re being lied to” pic.twitter.com/MLC1lH6Ejr
— BNO News (@BNONews) March 14, 2022
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో.. ఆమెను అరెస్టు చేయడానికి అవసరమైన ఆధారాలు దొరకలేదని ఆమె తరపు న్యాయవాది పావెల్ చికోవ్ వెల్లడించారు. ‘అక్రమ ప్రజా కార్యక్రమం’ నిర్వహించినందుకు గాను ఆమెపై అభియోగాలు మోపినట్టు తెలిపారు. పోలీసుల అభియోగాల ప్రకారం.. ఈ కేసులో ఆమెకు జరిమానా లేదంటే పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రష్యా సరికొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. ఆమెపై మరింత తీవ్రమైన అభియోగాలు మోపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also : America Warns China : రష్యాకు సాయం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలి-చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్