Salima Mazari: సలీమా మజారీ-తాలిబాన్లను ఎదిరించిన మహిళా గవర్నర్.. చివరిక్షణం వరకూ

వందల మంది అధికారులు దేశవదిలి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే ఆమె ఒక్కరే పోరాడారు. చాహర్ కింట్ జిల్లాలో తాలిబాన్లు అదుపులోకి తీసుకునేంత వరకూ..

Afghan Taliban

Salima Mazari: తాలిబాన్లకు ఎదురునిలిచిన అఫ్ఘానిస్తాన్ తొలి మహిళా గవర్నర్ సలీమా మజారీ. వందల మంది అధికారులు దేశవదిలి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే ఆమె ఒక్కరే పోరాడారు. చాహర్ కింట్ జిల్లాలో తాలిబాన్లు అదుపులోకి తీసుకునేంత వరకూ వెనక్కు తగ్గలేదు. అఫ్ఘాన్ మొత్తాన్ని ఆక్రమించుకునేంత వరకూ.. ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ పారిపోయేంత వరకూ అధికారిగానే వ్యవహరిస్తూ నాయకత్వ తీరును ప్రదర్శించారు.

కొన్నేళ్ల క్రితం అఫ్ఘానిస్తాన్ లో ఉన్న ముగ్గురు మహిళా గవర్నర్ లలో ఒకరుగా ఉణ్నారు సలీమా మజారీ. అఫ్ఘానిస్తాన్ లోని చాలా ప్రాంతాలు దాదాపు పోరాటం లేకుండానే తాలిబాన్ వశమైపోతుంటే.. సలీమా చాహర్ కింట్ జిల్లా ప్రాంతాన్ని కాపాడుకుంటూ వచ్చారు. చివరికి చాహర్ కింట్ జిల్లా అధికారం కోసం వచ్చిన తాలిబాన్లకు ఎదురొడ్డి పోరాడి.. దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

చివరి క్షణం వరకూ.. అఫ్ఘాన్ ప్రెసిడెంట్ పారిపోయి అధికారికంగా తాలిబాన్లు చేజిక్కించుకోనంత వరకూ మిగిలి ఉన్న ప్రాంతం చాహర్ కింట్ మాత్రమే. ఓ మహిళ అధ్యక్షతన ఆ ప్రాంతం జరిగిన అభివృద్ధి గురించి కొన్నేళ్లుగా ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. తాలిబాన్లు ఆక్రమించిన అనంతరం కూడా ఆమె ప్రజల భద్రతనే కాంక్షిస్తున్నారు.