Samosa Bound for Space Crash-Landed in France : భారతీయ వంటకాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. ప్రపంచదేశాలు భారతీయ వంటకాలకు ఫిదా కావాల్సిందే. విదేశీయులు సైతం భారతీయ వంటకాలను ఇష్టంగా ఆరగిస్తుంటారు. అలాంటి గొప్ప రుచులు కలిగిన భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇటీవల యూకేలోని ఒక భారతీయ రెస్టారెంట్ ఒక సమోసాను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. కానీ, అది వెంటనే ఫ్రాన్స్ లో క్రాష్ ల్యాండ్ అయింది. సమోసా అంతరిక్షంలోకి ప్రవేశించడం ఇదేం మొదటిసారి కాదు. 2007లో అంతరిక్ష కేంద్రంలో భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా సమోసాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.
అంతరిక్ష ప్రయోగం కోసం.. ఒక ఆలూ సమోసాను ఉపయోగించారు. అంతరిక్షంలో ఎక్కువసేపు ఉండేందుకు సాధారణం కంటే ఎక్కువ సేపు వేయించారు. ఈ సమోసాను, ర్యాప్ రెండింటిని ఒక పెట్టెలో ఉంచాడు. హీలియం బెలూన్ తో పాటు గోప్రో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ కూడా యాడ్ చేశాడు. పూర్తిగా రెడీ చేయకుండానే హీలియం బెలూన్ విడిచిపెట్టేశాడు. మొదటి ప్రయత్నం క్రాఫ్ట్ అయింది. ఇక రెండో ప్రయత్నం హీలియం లేక విఫలమైంది. మూడో ప్రయత్నంలో ఈ సమోసా ప్యాకేజీ విమానంతో పాటుగా ప్రయాణించింది. సమోసా ప్రతి కదలికను రికార్డు చేసేలా కెమెరా కూడా అమర్చారు.