most dangerous temple
Most Dangerous Temple : జపాన్ లో అత్యంత ప్రమాదకరమైన ఆలయం ఉంది. అక్కడికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. జపాన్ లోని టొట్టోరి ప్రాంతంలోని మిసాసా పట్టణంలో ఉంది. ఈ పురాతన బౌద్ధ ఆలయం పేరు సాన్ బుత్సుజి ఆలయం. ఇది మౌంట్ మిటోకు కొండ శిఖరం అంచున ఉంది. ఆలయంలో భాగమైన నగీరెడో హాల్ కొండ శిఖరం అంచున వేలాడుతున్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయానికి జపాన్ లో అత్యంత ప్రమాకరమైన జాతీయ నిర్మాణంగా పేరుంది.
అక్కడకు వెళ్లేందుకు సునాయసమైన మార్గమేదీ లేదు. సముద్ర మట్టం నుంచి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండ శిఖరానికి చేరుకోవాలంటే శ్రమ, ఆకలిదప్పులకు ఓర్చుకుని పర్వతారోహణ చేయక తప్పదు. 7వ శతాబ్దానికి చెందిన బౌద్ధ సన్యాసి, షుగెందో మతస్థాపకుడు ఎన్ నో గ్యోజా హయాంలో నిర్మించిన ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం.
famous Temples : ఆ దేవాలయాలను దర్శంచుకోవటం అంత సులభం కాదు..
జపాన్ ప్రభుత్వం ఆలయాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించి, రక్షిస్తోంది. ఎగుడుదిగుడు రాళ్ల మీదుగా దీనిని చేరుకోవడం సాహసకృత్యమే అని చెప్పవచ్చు. శీతాకాలంలో సాధారణంగా ఈ కొండపై మంచు పేరుకుపోయి అడుగు వేయడం కూడా కష్టతరమవుతుంది. అందుచేత ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు ఆలయం పూర్తిగా మూసివేసి ఉంటుంది. అయితే ప్రకృతి ఆహ్లాకరంగా ఉన్నప్పుడు మాత్రం సాహికులైన సందర్శకులు దేశ విదేశాల నుంచి వచ్చి దర్శించుకుని వెళ్తుంటారు.