Saudi Arabia : భారత్ సహా ఆ దేశాలకు వెళితే కఠిన చర్యలు : ప్రజల్ని హెచ్చరించిన సౌదీ సర్కార్
భారత్ తో సహా దాదాపు మరో 10 దేశాలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిక చేసింది. హెచ్చరికలను అతిక్రమించి ఆ దేశాలకు ప్రయాణాలు చేస్తే వారు మూడు సంవత్సరాలపాటు ప్రయాణాలు చేయకుండా నిషేధం విధిస్తామని..చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
- nagamani
- Published On : July 28, 2021 / 01:43 PM IST
Saudi Arabia Warning For People Who Travel To Red List Countries
Saudi Arabia Travel Ban..COVID ‘red List’ Countries : భారత్ తో సహా దాదాపు మరో 10 దేశాలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిక చేసింది. హెచ్చరికలను అతిక్రమించి ఆ దేశాలకు ప్రయాణాలు చేస్తే వారు మూడు సంవత్సరాలపాటు ప్రయాణాలు చేయకుండా నిషేధం విధిస్తామని..చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ భారత్ తో పాటు వెళ్లకూడని దేశాలు ఏవేవి? అసలు ఆ దేశాలు వెళ్లకూడదని సౌదీ ప్రజలకు ఎందుకు అంత కఠిన వార్నింగ్ ఇచ్చిదంటే..
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాలను సౌదీ అరేబియా దేశం రెడ్ లిస్టులో పెట్టింది.రెడ్ లిస్ట్ లో ఉన్న దేశాలకు వెళ్లకూడదని ప్రజలకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. కాదని ఎవరైనా వెళితే మూడేళ్ల పాటు వారిపై ప్రయాణ నిషేధం విధిస్తామని హెచ్చరించింది. కరోనా కేసులు, డెల్టా వేరియంట్ ముప్పు పొంచి ఉన్న క్రమంలో సౌదీ సర్కార్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
గత మే నెలలో కొందరు అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే తాము రెడ్ లిస్ట్ గా ప్రకటించిన రెడ్ లిస్ట్ దేశాలకు వెళ్లారని..తాము విధించిన ట్రావెల్ నిబంధనలను ఉల్లంఘించారని సౌదీ అంతర్గత శాఖ అధికారి తెలిపారు. ఇది మొదటిసారి కాబట్టి వదిలేశామని ఇకనుంచి ఎవ్వరూ ఇటువంటి ఉల్లంఘనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోసారి ఎవరైనా ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బ్రెజిల్, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్థాన్, అర్జెంటీనా, ఇథియోపియా, ఇండోనేసియా, లెబనాన్, టర్కీ, వియత్నాం, భారత్ లను సౌదీ రెడ్ లిస్ట్ లో పెట్టింది. నేరుగా గానీ లేదా వేరే దేశాల ద్వారా గానీ రెడ్ లిస్ట్ లోని దేశాలకు వెళ్లకూడదని ప్రజల్ని హెచ్చరించింది. కరోనా కట్టడిలోకి రావాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని సౌదీ అధికారులు అంటున్నారు.
