Mega tsunami 2025
Mega tsunami: ఓ ‘మెగా సునామీ’ యూఎస్ పసిఫిక్ తీర ప్రాంతాలను తాకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు సంచలన హెచ్చరిక జారీ చేశారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ సునామీ క్యాస్కేడియా సబ్‌డక్షన్ జోన్ (CSZ)లో సంభవించే భూకంపం కారణంగా రావచ్చు.
ఇది ఒక ఫాల్ట్ లైన్, ఉత్తర కాలిఫోర్నియా నుంచి వాంకూవర్ ఐలాండ్ వరకు సుమారు 600 మైళ్ల వరకు వ్యాపిస్తుంది.
ఈ ప్రాంతంలో జువాన్ డీ ఫ్యూకా ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్ కిందకి దూసుకుపోతూ భారీ టెక్టానిక్ ఒత్తిడిని లాగుతోంది.
వెర్జీనియా టెక్‌లోని జియోసైంటిస్ట్ టీనా డూరా నేతృత్వంలోని బృందం అంచనా ప్రకారం వచ్చే 50 ఏళ్లలో CSZ ప్రాంతంలో 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం 15%గా ఉంది.
ప్రొసీడింగ్స్ ఆఫ్ ఆది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Proceedings of the National Academy of Sciences) పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, భూకంపం సంభవిస్తే తీర ప్రాంత భూమి 6.5 అడుగుల వరకు కుంగిపోవచ్చు.
వందల అడుగుల ఎత్తు అలలతో సునామీ వచ్చే అవకాశం ఉంది.
దీంతో మిలియన్ల మంది ప్రజలు, ప్రధాన మౌలిక సదుపాయాలు, పశ్చిమ తీర ఎకోసిస్టమ్స్ భారీ ప్రమాదంలో పడతాయి.
డూరా టీమ్ రూపొందించిన మోడల్స్ ప్రకారం, CSZలో సంభవించే భూకంపం 1,000 అడుగుల ఎత్తుకు చేరే ‘మెగా సునామీ’ని సృష్టిస్తుంది. సాధారణంగా కొన్ని అడుగుల అలలతో వచ్చే సునామీతో పోలిస్తే ఇది చాలా విపరీతమైనది.
సియాటిల్, పోర్ట్‌లాండ్, ఉత్తర కాలిఫోర్నియాలోని పలు పట్టణాలు నిమిషాల్లోనే నీటిలో మునిగే ప్రమాదంలో ఉన్నాయి.
వెర్జీనియా టెక్ అధ్యయనంలో వేల సార్లు సిమ్యులేషన్లు జరపగా, ప్రస్తుత అంచనాల కంటే మరింత మంది ప్రజలు, భవనాలు, రహదారులు ప్రభావితమవుతాయని తేలింది. (Mega tsunami)
ఉత్తర అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన ఫాల్ట్ లైన్లలో క్యాస్కేడియా సబ్‌డక్షన్ జోన్ ఒకటి అని టీమ్ తెలిపింది. జువాన్ డీ ఫ్యూకా ప్లేట్ నార్త్ అమెరికన్ ప్లేట్ కిందకి నెమ్మదిగా దూసుకెళ్తూ టెక్టానిక్ ఒత్తిడిని పెంచుతుంది.
ఈ ఒత్తిడి అకస్మాత్తుగా భారీ భూకంపం రూపంలో విడిపోతే తీర ప్రాంతాలు వెంటనే కుంగి, వరద విస్తరించి, తీరరేఖలు క్షణాల్లో మారిపోవచ్చు.
Also Read: Arjun Tendulkar Engagement: వామ్మో.. అర్జున్ టెండూల్కర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే? సచిన్ కొడుకా మజాకా..