Scott Morrison Australia Pm Criticised For Father's Day Trip Amid Lockdowns
Scott Morrison: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తన ఫ్యామిలీని కలిసేందుకు లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు. దాంతో మారిసన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫాదర్స్ డే రోజున తన పిల్లలను కలిసేందుకు కెన్ బెరా నుంచి సిడ్నీకి ప్రైవేట్ జెట్ లో ప్రధాని మారిసన్ వెళ్లారు. ఒకవైపు దేశమంతా కరోనా ఆంక్షలతో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన కరోనా ఆంక్షలను ఉల్లంఘించారంటూ విమర్శలు వస్తున్నాయి. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు దూరంగా ఉంటున్నారు. కానీ, దేశ ప్రధాని కావడంలో మారిసన్ కు మినహాయింపును ఇచ్చారు అక్కడి అధికారులు. దాంతో ఆదివారం ప్రధాని మారిసన్ తన ప్రత్యేక విమానంలో కెన్‌బెరా నుంచి సిడ్నీకి వెళ్లారు. ఆయనకు ఎలా మినహాయింపు ఇచ్చారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
Elu Robot : ఎడారిలో మంచినీరు తయారుచేసే రోబో..లీటరు నీరు తయారీకి 7పైసలు ఖర్చు
ఆరోగ్యశాఖ అధికారులు స్పందిస్తూ.. అత్యవసర ఉద్యోగి కింద ప్రధానికి తన ఫ్యామిలీని కలుసుకునే అవకాశం ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి ద్వంద ప్రమాణాలంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ విజృంభించడంతో సిడ్నీ, కెన్ బెరా, మెల్ బోర్న్ నగరాల్లో లాక్ డౌన్ విధించారు. దాంతో సగానికి పైగా ఆస్ట్రేలియన్లు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలావరకు ఆస్ట్రేలియా రాష్ట్రాల్లో సరిహద్దులన్నీ మూతపడ్డాయి. డెల్టా వేరియంట్ ప్రభావంతో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తమ సొంత పిల్లల్ని చూసేందుకు వెళ్లడం తప్పు కాదు.. కానీ, సాధారణ ప్రజలకు కూడా ఆ అవకాశం ఇవాల్సి ఉందని లేబర్ పార్టీ ఎంపీ బిల్ షార్టన్ ఆరోపించారు. ప్రధాని కోసం ఒక రూల్, ప్రజలకు మరో రూల్ ఉండదని అన్నారు.
సెప్టెంబర్ మొదటి ఆదివారం రోజు ఆస్ట్రేలియాలో ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. తన ఫ్యామిలీతో దిగిన ఫొటోను ప్రధాని మారిసన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అందులో ఒక తండ్రి కావడం అనేది ఓ గొప్ప ఆశీస్సు గా అభివర్ణించారు. ఈ ఫొటో గత ఏడాదిలో దిగినదిగా మారిసన్ క్యాప్షన్ ఇచ్చారు. కానీ, లాక్‌డౌన్ ఆంక్షలతో తల్లిదండ్రులు సరిహద్దుల వద్ద నిలిచిపోయారని, తమ పిల్లల్ని కలుసుకునే పరిస్థితి లేదని, ప్రధానికి మాత్రం ఎలా అవకాశం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
WhatsApp End : ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎప్పటినుంచో తెలుసా?