Turkey Parliament : టర్కీ పార్లమెంట్‌లో రచ్చరచ్చ.. కొట్టుకున్న అధికార, విపక్ష ఎంపీలు.. వీడియో వైరల్
Turkey Parliament : టర్కీ (Turkey) పార్లమెంట్ రణరంగంగా మారింది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు బాహాబహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తన్నుకున్నారు.
- Harishth Thanniru
- Published On : February 12, 2026 / 11:26 AM IST
Turkey Parliament
- టర్కీ పార్లమెంట్ లో రచ్చరచ్చ
- కొట్టుకున్న అధికార, విపక్ష పార్టీల సభ్యులు
- న్యాయశాఖ మంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో ఘటన
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Turkey Parliament : టర్కీ (Turkey) పార్లమెంట్ రణరంగంగా మారింది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు బాహాబహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త న్యాయశాఖ మంత్రి ప్రమాణ స్వీకారం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read : Musical Road : దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..
ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అయిన అకిన్ గుర్లెక్ ను కొత్త న్యాయశాఖ మంత్రిగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నియమించారు. న్యాయమంత్రిత్వ శాఖకు అధిపతిగా గుర్లెక్ నియామకంపై ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పీ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
గుర్లెక్ ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ గా ఉన్న సమయంలో సీహెచ్‌పీ సభ్యులతో సంబంధం ఉన్న అనేక కేసులను ఆయన పర్యవేక్షించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకోవడానికి గుర్లెక్ నియామకం చేపట్టారంటూ సీహెచ్‌సీ సభ్యులు మండిపడ్డారు. ఇది న్యాయ స్వేచ్ఛను కూడా దెబ్బతీస్తుందని విమర్శలు చేశారు. ఈ క్రమంలో బుధవారం పార్లమెంట్‌లో గుర్లెక్ ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో ఆయన్ను అడ్డుకున్నారు.
గుర్లెక్ బుధవారం ప్రమాణ స్వీకారానికి సిద్ధమవ్వగా అతన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష ఎంపీలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. కొద్దిసేపటికే ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తన్నుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో స్పీకర్ కల్పించుకొని న్యాయశాఖ మంత్రి ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కొంత సమయం తరువాత ప్రారంభమైన సమావేశాల్లో అధికార పార్టీ నేతలు గుర్లెక్ చుట్టూ రక్షణగా నిలబడి ఉండగా ఆయన న్యాయమంత్రిత్వ శాఖ అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
🚨🇹🇷 WATCH: A literal FIGHT just broke out in the Turkish parliamentpic.twitter.com/dPWtsxh9wg
— mistersunshinebaby (@mrsunshinebaby) February 11, 2026
