Musical Road : దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..
Musical Road : భారతదేశంలో తొలి మ్యూజికల్ రోడ్డు (Indias First Musical Road) ప్రారంభమైంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా ప్రారంభించారు.
Musical Road
- దేశంలో తొలి మ్యూజికల్ రోడ్డు
- ముంబైలో అందుబాటులోకి
- ప్రారంభించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
Musical Road : భారతదేశంలో తొలి మ్యూజికల్ రోడ్డు (Indias First Musical Road) ప్రారంభమైంది. ముంబై కోస్టల్ రోడ్డులోని నారిమన్ పాయింట్ నుంచి వర్లి వైపు వెళ్లే నార్త్‌బౌండ్ లేన్‌లో 500 మీటర్ల మేర మ్యూజికల్ రోడ్డు ఏర్పాటు చేశారు. దీన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా ప్రారంభించారు.
Also Read : ధాయిలాండ్‌లో దారుణం.. డేకేర్ సెంటర్లో కాల్పులు.. 22 మంది పిల్లలు సహా 34 మంది..
మ్యూజికల్ రోడ్డుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా, యూఏఈల్లో ఈ మ్యూజికల్ రోడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో తొలి మ్యూజికల్ రోడ్డు ముంబైలో అందుబాటులోకి వచ్చింది. ఈ రోడ్డుపై వాహనాలు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో వెళ్తే టైర్లు, రోడ్డు ఉపరితలం మధ్య ఘర్షణ ఏర్పడి శబ్దం ఉత్పత్తి అవుతుంది. టైర్ల నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జై హో’ పాట వాహనంలో స్పష్టంగా వినిపిస్తుంది. గ్లాసెస్ మూసివేసినా కూడా కారు లోపల సాంగ్ వినపడుతుంది.
రోడ్డు ఎంట్రన్స్ వద్ద సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇన్నోవేషన్ రోడ్డు వాహన వేగాన్ని అదుపులో ఉంచుతూ సేఫ్టీని ప్రోత్సహిస్తుందని తద్వారా ప్రయాణికులకు అనందదాయక ప్రయాణ అనుభవం ఇస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ రోడ్లను విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రూ.6.21 కోట్లు ఖర్చు చేసింది. టన్నెల్ ఎగ్జిట్ తరువాత ప్రియదర్శిని పార్కు, అమర్సన్స్ గార్డెన్ మధ్యలో 500 మీటర్లు మ్యూజికల్ రోడ్డును ఏర్పాటు చేశారు.
