×
Ad

Mexico : మెక్సికోలో కూలిన చర్చ్ పైకప్పు…ఏడుగురి మృతి

మెక్సికో దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈశాన్య మెక్సికోలో ఆదివారం ప్రార్థన సమయంలో చర్చి పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు....

  • Published On : October 2, 2023 / 08:44 AM IST

Mexico Church Roof Collapse

Mexico : మెక్సికో దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈశాన్య మెక్సికోలో ఆదివారం ప్రార్థన సమయంలో చర్చి పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. తీరప్రాంత పట్టణమైన సియుడాడ్ మాడెరోలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది గాయపడ్డారని తమౌలిపాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. (Church Roof Collapse) ఈ ప్రమాదంలో ఇంకా ఎక్కువ మంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. (Seven Killed In Mexico)

Security Alert : ముంబయి ఆకాసా విమానానికి భద్రత హెచ్చరిక..సెక్యూరిటీ అలర్ట్

పౌర రక్షణ దళాలు సహాయ చర్యలు చేపట్టాయని గవర్నర్ అమెరికా విల్లారియల్ చెప్పారు. శాంటా క్రజ్ పారిష్ శిథిలాల కింద 20 మంది ఉన్నారని, సీలింగ్ కూలిపోయినప్పుడు బాప్టిజం జరుపుకుంటున్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. కూలిన భవన శిథిలాల నుంచి దుమ్ము, ధూళి వెలువడుతోంది.

Nikhat Zareen : ఆసియా బాక్సింగ్ క్రీడల్లో నిఖత్ జరీన్‌కు కాంస్య పతకం…ఎమ్మెల్సీ కవిత అభినందన

చర్చ్ వేడుకల్లో పై కప్పు కూలిపోయిందని డియోసెస్ బిషప్ జోస్ అర్మాండో అల్వారెజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. ఇంకా శిథిలాల కింద ఉన్న ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.