Sheikh Hasina: నన్ను చంపినా సరే.. బంగ్లాదేశ్ వచ్చి తీరుతా.. భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. షేక్ హసీనా సంచలన ప్రకటన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) తన స్వదేశానికి తిరిగి వెళ్లాలనే పట్టుదలను మరోసారి స్పష్టంగా వెల్లడించారు.

Sheikh hasina vows to return to bangladesh in december despite threats

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశానికి తిరిగి వెళ్లాలనే పట్టుదలను మరోసారి స్పష్టంగా వెల్లడించారు. వాషింగ్టన్ కేంద్రంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆమె, వచ్చే డిసెంబర్‌లో తాను ఖచ్చితంగా బంగ్లాదేశ్ చేరుకుంటానని ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం తనను అరెస్ట్ చేసినా, చిత్రహింసలకు గురిచేసినా, చివరికి ప్రాణాలు తీసినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. దేశంలో తీవ్ర ప్రతికూల వాతావరణం ఉందని, ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ తన మద్దతుదారులు, ప్రజల తరఫున నిలబడటం రాజకీయ బాధ్యతగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

Mohan Bhagwat: ప్రభుత్వాలు మారితే పరిస్థితులు మారవు.. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానం.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. 1975 నాటి దారుణాల్ని గుర్తు చేసుకున్న హసీనా:

2024 ఆగస్టులో చోటుచేసుకున్న హింసాత్మక ఆందోళనల దృష్ట్యా ఢాకాను విడిచి భారత్‌కు వచ్చిన హసీనా(Sheikh Hasina), రాజకీయ సంక్షోభ సమయంలో తనకు ఆశ్రయం కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 1975లో తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్, కుటుంబ సభ్యుల దారుణ హత్యల సమయంలో కూడా భారత్ తమ కుటుంబానికి ఆసరాగా నిలిచిందని ఆమె భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ ఘోరం నుంచి బయటపడి 1981లో తిరిగి స్వదేశానికి వెళ్లానని, ఇప్పుడు కూడా అదే ధైర్యంతో బంగ్లాదేశ్‌లో అడుగుపెడతానని స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.. ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం:

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వంపై హసీనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవామీ లీగ్ నాయకులపై, తనపై అక్రమ క్రిమినల్ కేసులు బనాయిస్తూ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బంగ్లాదేశ్ భవిష్యత్తును, పాలనను స్వేచ్ఛాయుతమైన, భాగస్వామ్య ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా అక్కడి ప్రజలే నిర్ణయించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అయితే హసీనా ప్రయాణంపై ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ప్రయాణానికి సంబంధించి నిర్దిష్ట తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.