alligator and body of fish : సింగపూర్‌లోని మాక్ రిచీ రిజర్వాయర్ దగ్గర ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ విచిత్రపు జీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ విచిత్ర జీవి తల మొసలిలా ఉంది. శరీరం అంతా పెద్ద చేపలా ఉంది. మొసలిలాగా..పెద్ద దవడలు, పదునైనా పళ్లతో భయానకంగా ఉన్న ఈ జీవి కళేబరాన్ని చూసిన వారు షాక్ అయ్యారు. వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో
ఈ వింత జీవిని దూరం నుంచి చూసిన వాళ్లు ముందు భయపడ్డారు. తరువాత నెమ్మదిగా దగ్గరకెళ్లిచూశారు. తీరా వెళ్లి చూస్తే… తల మొసలి తలలా ఉంది. మిగతా శరీరమంతా చేపలా ఉంది. “ఇదేంటి ఇది చేపా? మొసలా?..లేదా మరోరకం జీవా? వింతగా ఉందే అని ఆశ్చర్యపోయారు.
దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో స్థానిక నేషనల్ పార్క్స్ బోర్డ్ కు తెలిసింది. దీంతో దాన్ని చూడటానికి వచ్చిన అధికారులు అది అత్యంత అరుదైన చేప అని… అమెరికా దక్షిణ ప్రాంతంలో ఇటువంటి చేపలు ఉంటాయని తెలిపారు. అంతేకాదు… ఈ అరుదైన చేపలు ఏనాటినుంచో ఉన్నాయని తెలిపారు.
ఈ చేపలకు తల మాత్రం మొసలి తలలా ఉంటుంది. నోట్లో బలమైన దంతాలుంటాయి. అందువల్ల ఇవి సముద్రాల్లో ఏ జీవినైనా వేటాడతాయనీ..తెలిపారు. ఎటువంటి జీవినైనా ఈజీగా వేటాడి తింటాయి. అందుకే అంత పెద్ద సైజు పెరుగుతాయని తెలిపారు.
ఇటువంటి చేపల వల్ల సముద్రాల, నదుల్లో మిగతా చేపలు, జీవ రాశికి ప్రమాదం. అందువల్ల అది చనిపోవడం మంచిదే అంటున్నారు. సింగపూర్ లా ప్రకారం… చేపలైనా జీవులైనా సరే వాటిని సరస్సులు, నదులు, చెరువుల్లోకి వదలకూడదు. వదిలితే చట్టపరంగా చర్యలుంటాయి. ఈ వింత జీవికి సంబందించి మరో షాకింగ్ విషయమేంటంటే..అమెరికాకీ, సింగపూర్‌కీ 10వేల మైళ్లకు పైగా దూరం. మరి అక్కడ ఉండే చేప… ఇక్కడకు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు.