×
Ad

Viral Video : దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై షార్ట్ విప్పేసి యువతిపై అత్యాచారయత్నం.. షాకింగ్ వీడియో

Viral Video : అతడి వికృత చర్యతో బాధితురాలు షాక్ కి గురైంది. భయపడిపోయింది. ఆ వెంటనే తేరుకుని ప్రతిఘటించింది.

  • Published On : July 6, 2023 / 08:59 PM IST

Karachi Viral Video (Photo : Google)

Viral Video – Karachi : మహిళకు రక్షణ కరువైంది. ఆ దేశం ఈ దేశం అని లేదు. అన్ని చోట్ల స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి బరి తెగిస్తున్నారు. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు కామంతో కాటేయాలని చూస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ కరాచీలో అత్యంత భయానక సంఘటన జరిగింది. ఓ కామాంధుడు పట్టపగలు నడిరోడ్డుపై దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై అత్యాచారయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది.

కరాచీలోని గులిస్తాన్ ఈ జౌహర్ ప్రాంతంలో జూలై 3న షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి బైక్ పై వచ్చాడు. అతడు షార్ట్ వేసుకుని ఉన్నాడు. బైక్ ని రోడ్డు పక్కన ఆపాడు. ఆ తర్వాత బండి దిగాడు. ఆ వెంటనే షార్ట్ విప్పేశాడు. అదే సమయంలో ఓ యువతి రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది.

Also Read..Boyfriend : యూపీలో బాయ్ ఫ్రెండ్ దారుణం…వివాహితను గర్భవతిని చేసి, ఆపై…

ఇది గమనించిన ఆ కామాంధుడు యువతి వెనుక నుంచి ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశాయి. అఘాయిత్యం చేయబోయాడు. అతడి వికృత చర్యతో బాధితురాలు షాక్ కి గురైంది. భయపడిపోయింది. ఆ వెంటనే తేరుకుని ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేసింది. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాడు. బైక్ దగ్గరికి వచ్చి తన షార్ట్ వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడు బైక్ పై రావడం, షార్ట్ విప్పడం, యువతిపై అత్యాచారయత్నం చేయడం..ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Also Read..USA Multnomah Falls : జలపాతం చూసేందుకు వెళ్లి లోయలో పడి వ్యక్తి మృతి.. భార్య, పిల్లలు చూస్తుండగానే

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చే వరకు తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.