×
Ad

Marriyum Aurangzeb : పాకిస్థాన్‌ను షేక్ చేస్తున్న లేడీ పొలిటీషియన్.. బాబోయ్ ఇంత యంగ్‌గా ఎలా మారిపోయింది.. అసలు ఎవరీ మరియం ఔరంగజేబ్?

Marriyum Aurangzeb : పాకిస్తాన్ సోషల్ మీడియా అంతా పిచ్చెక్కిపోతుంది. యూజర్లు గోలగోల చేస్తున్నారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు. అంతలా పాకిస్తాన్‌ను షేక్ చేస్తున్నది ఎవరో కాదు ఆ దేశానికి చెందిన ప్రముఖ పొలిటీషియన్ మరియం ఔరంగజేబ్.

Marriyum Aurangzeb

  • పాకిస్తాన్‌ను షేక్ చేస్తున్న లేడీ పొలిటీషియన్ మరియం ఔరంగజేబ్
  • ఇన్నాళ్లు 45ఏళ్ల మహిళలా సాదాసీదాగా కనిపించిన మరియం.
  • సడన్‌గా 20ఏళ్ల అమ్మాయిలా మారిపోవడవంపై సోషల్ మీడియాలో పెద్దెత్తున చర్చ
  • వైరల్ అవుతున్న పాత, కొత్త ఫొటోలు
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

Marriyum Aurangzeb : పాకిస్తాన్ సోషల్ మీడియా అంతా పిచ్చెక్కిపోతుంది. యూజర్లు గోలగోల చేస్తున్నారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు. అంతలా పాకిస్తాన్‌ను షేక్ చేస్తున్నది ఎవరో కాదు ఆ దేశానికి చెందిన ప్రముఖ పొలిటీషియన్ మరియం ఔరంగజేబ్. ఔను. నిన్న మొన్నటి వరకు సాధారణ గృహిణిలా ఉంటూ 45ఏళ్ల వయసులో 45ఏళ్ల మహిళలా కనిపిస్తూ ఏదో సాదాసీదాగా కనిపించే ఆమె సడన్‌గా 20ఏళ్ల అమ్మాయిలా మారిపోయింది. ఏ రేంజ్‌లో ట్రాన్సఫర్మేషన్ జరిగిందంటే ఫొటోలు పక్కపక్కన పెట్టి చూంపిచి ఇద్దరూ ఒకటే అని చెప్పినా జనం నమ్మలేనంతగా మారిపోయిందామె.

Also Read : WPL 2026 : డ‌బ్ల్యూపీఎల్‌లో ఆర్‌సీబీ జోరు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన స్మృతి మంధాన సేన‌..

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దార్ పెళ్లి ఈ మధ్య లాహోర్‌లో ధూంధాంగా జరిగింది. చాలా పెద్ద కుటుంబం కావడంతో చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. అందులో మాత్రం ఒక్కరే హైలైట్ అయ్యారు. ఆమే మరియం ఔరంగజేబ్. ఆమె కూడా పొలిటీషియన్. 2013 నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ మంత్రి. అటవి, పర్యావరణం, ఫిషరీస్ లాంటి పోర్ట్ ఫోలియోలను ఆమె చూస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు వ్యక్తిగత సౌందర్యంపై పెద్దగా శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించని ఆమె ఎందుకు సడన్‌గా అలా మారిపోయారనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో జనం దీనికి చాలాచాలా కారణాలు చెబుతున్నారు. బాగా డబ్బులు సంపాదిస్తున్నట్టుంది.. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇలా అందం పెంచే పనిలో ఉన్నట్టుంది అని కూడా జనం విమర్శలు చేస్తున్నారు. కొందరైతే ఈమెకు సర్జరీలు చేసిన ప్లాస్టిక్ సర్జన్ ముందు హాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోయిన్లకు సర్జరీలు చేసే వాళ్లు కూడా వేస్టే అని సెటైర్లు వేస్తున్నారు.

కొందరైతే ఆమె పాత, కొత్త ఫొటోలు పెట్టి ఓల్డ్ పాకిస్తాన్, న్యూ పాకిస్తాన్ అని ట్రోలింగ్ చేస్తున్నారు. అంత ట్రాన్స్ ఫర్మేషన్ సీక్రెట్ ఏంటో మాకుకూడా చెప్పు తల్లీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా మేకప్ మహిమా? లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నారా? లేకపోతే డైటింగ్ చేసి తగ్గారా? ఆ సీక్రెట్స్ మాక్కూడా చెప్పాలంటూ సోషల్ మీడియాలో జనం తెగ ఆరా తీస్తున్నారు. అయితే, ఇదంతా ఒజెంపిక్ ట్యాబ్లెట్ మహిమ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇంకొందరైతే ఆమె ఎన్నిరకాల సర్జరీలు చేయించుకుందో అంటూ ఓ పెద్ద లిస్ట్ కూడా పెట్టారు. లిప్ ఇంజెక్షన్లు, ఫ్యాట్ రిడక్షన్, రైనో ప్లాస్టీ, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్, బొటాక్స్, జా డిడక్షన్, డబుల్ చిన్ రిమూవల్, లైపో సక్షన్, ఫ్యాట్ రిమూవల్, డబుల్ ఐలిడ్ సర్జరీ, అండర్ ఐ ఫిల్లర్స్, చీక్ ఫిల్లర్స్, నోస్ బ్రిడ్జి ఇంప్లాంట్.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు. ఇన్ని రకాల సర్జరీలు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అవన్నీ చేయించుకోవడానికి సుమారు 4కోట్లు ఖర్చవుతుందని, దుబాయ్ లో ఓ డాక్టర్ దగ్గర చేయించిందని కూడా పుకార్లు నడుస్తున్నాయి.