ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 వ్యాధికి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్ కోసం వచ్చేవారం నుంచి సింగపూర్ సంస్థ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. సింగపూర్ ఆధారిత బయో టెక్నాలజీ కంపెనీ Tychan తొలి దశ ట్రయల్ మొదలుపెట్టనుంది.
ఈ క్లినికల్ ట్రయల్‌ను SingHealth Investigational Medicine Unit నిర్వహించనుండగా.. ఆరు వారాల పాటు కొనసాగనుంది. కొవిడ్-19 వ్యాధికి కారణమయ్యే Sars-CoV-2 వైరస్ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకునే మోనోక్లోనల్ యాంటీబాడీ లేదా రోగనిరోధక వ్యవస్థ ప్రోటీన్ TY027 సేప్టీ, ప్రభావాన్ని నిర్ణయించడమే ట్రయల్ ఉద్దేశమని Tychan ఒక ప్రకటనలో పేర్కొంది.
శరీరంలోని ఇన్ఫెక్షన్ తో పోరాడేందుకు యాంటీబాడీస్ తయారువుతాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ సహజ యాంటీబాడీలుగా పనిచేస్తాయి. రోగులలో వ్యాధుల చికిత్సకు పెద్ద మొత్తంలో వేరుచేసి తయారు చేయవచ్చునని అంటున్నారు. కొవిడ్-19 రోగుల్లో TY027 ప్రోటీన్ ద్వారా చికిత్స చేయడం ద్వారా వారిలో వ్యాధి తీవ్రత తగ్గిపోయి తొందరగా కోలుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
మొదటి దశ విజయవంతమైతే.. తరువాతి పరీక్షలలో ఇతర కరోనా రోగులకు యాంటీబాడీని ఇవ్వడానికి టైచన్ అనుమతి కోరనుంది. ఈ చికిత్స ప్రస్తుతం COVID-19 రోగులను లక్ష్యంగా చేసుకునే జరుగుతోందని కంపెనీ తెలిపింది. ఆరోగ్య సంరక్షణ కార్మికులకు లేదా విదేశీ ప్రయాణికులు వాడే ఇతర అప్లికేషన్ల కోసమా అనేది ట్రయల్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
కోవిడ్ -19 రోగులకు చికిత్స చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ఈ ట్రయల్ వ్యాక్సిన్ ఇస్తామని తద్వారా వారికి అంటువ్యాధులు రావని ప్రొఫెసర్ Ooi Eng Eong తెలిపారు. సింగపూర్ నుంచి COVID-19 ప్రభావిత ప్రాంతాలకు వెళ్లినవారిలో అంటువ్యాధులను నివారించడానికి ఈ ట్రయల్ ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. TY027 ను సింగపూర్ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆర్థిక అభివృద్ధి బోర్డు, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి అభివృద్ధి చేశారు.