COVID-19 : కరోనా చికిత్స తరువాత నీలిరంగులోకి మారిన పసిబిడ్డ కళ్లు

కోవిడ్ చికిత్స పొందిన ఓ పసిపాప కళ్లు నీలం రంగులోకి మారిపోయిన ఘటన జరిగింది. దానికి కారణం ఆ మెడిసిన్ వల్లనని తెలిపారు డాక్టర్లు. వెంటనే ఆ మెడిసిన్ వాడటం మానివేయాలని సూచించారు.

covid 19 treatment

Covid 19 Treatment : కరోనాకు ముందు కరోనా తరువాత అన్నట్లుగా మారిపోయింది ప్రపంచం. మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిన కోవిడ్ ఛాయలు ఆనాటికీ వీడటంలేదు. మరీ ముఖ్యంగా కోవిడ్ సోకి చికిత్స తీసుకున్నవారు పలు సమస్యలతో బాధపడుతునే ఉన్నారని..కోవిడ్ తరువాత గుండె సంబంధిత వ్యాధులు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. అలా కోవిడ్ చికిత్స పొందిన ఓ పసిపాప కళ్లు నీలం రంగులోకి మారిపోయిన ఘటన థాయ్ లాండ్ (Thailand)లో చోటుచేసుకుంది.

కరోనా వైరస్‌కు చికిత్స (Covid 19 Treatment) తీసుకున్న ఓ పసిబిడ్డ కళ్లు నీలి రంగులోకి మారాయి. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం..థాయ్ లాండ్ కు చెందిన ఆరు నెలల పసిబిడ్డ కు జ్వరం వచ్చింది. జ్వరంతోపాటు దగ్గుకూడా వచ్చేది. దీంతో తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా చిన్నారికి కొవిడ్‌ టెస్ట్‌ చేశారు. రిపోర్ట్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో చిన్నారికి మూడు రోజుల పాటు ఫెవిపిరావిర్‌తో (Favipiravir Medicine) చికిత్స అందించారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు.

Shivling : తన కోరిక తీర్చలేదని శివుడిపై యువకుడు కోపం, గుడిలో శివలింగాన్ని చోరీ చేసి ఏం చేశాడంటే..

కానీ ఆ తరువాత కొన్ని గంటలకే చిన్నారి కళ్ల రంగులో మార్పు కనిపించింది. 18 గంటల వ్యవధిలో చిన్నారి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి నీలి రంగులోకి మారాయి. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనతో మళ్లీ డాక్టర్ల వద్దకు తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన డాక్టరు ఫెవిపిరావిర్‌ మెడిసిన్ వాడటం వెంటనే ఆపేయాలని సూచించారు. ఆ తర్వాత ఐదు రోజులకు పసికందు కళ్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఆ మెడిసిన్ వాడకం నిలిపివేసిన ఐదో రోజుకు కళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయని తెలిపారు.

కాగా, చిన్నారులకు కొవిడ్ ట్రీట్‌మెంట్‌గా ఫెవిపిరావిర్‌(favipiravir)ను థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం 2022లో అనుమతించింది. ఓ మోస్తరు వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు వాడాలని సూచించింది.

ట్రెండింగ్ వార్తలు