World Record: Lip Balmsతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఆరేళ్ళ చిన్నారి..

ఆరేళ్ల బాలిక ఆరేళ్లలో 3,388 రకాల లిప్‌బామ్‌లు సేకరించి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్ సొంతం చేసుకుంది.

six years old girl Lip Balm-World Record: ఆరేళ్ల చిన్నారి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ చిన్నారి ఇష్టమే రికార్డు వరించేలా చేసింది. 10 ఏళ్ల వయస్సు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. వారికంటూ ప్రత్యేకించి హాబీలేమీ ఉండవు. కానీ ఓ ఆరేళ్ల చిన్నారికి ఓ హాబీ ఉంది. లిబ్ బామ్ లు సేకరించటమంటే చాలా ఇష్టం.అలా సరదగా లిప్ బామ్ లు సాధించిన ఆ చిన్నారిని గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది.

చైనాలోని హాంగ్‌కాంగ్‌కు చెందిన ఆరేళ్ల స్కార్లెట్‌ యాష్లీచెంగ్‌ అనే ఆరేళ్ల చిన్నారి కార్టూన్‌ బొమ్మల్లా ఉండే లిప్‌బామ్‌లు అంటే చాలా చాలా ఇష్టం. ఆ ఇష్టంతో అటువంటి బొమ్మలే కొనుక్కునేది. బొమ్మలంటేచాలు లిప్ బామ్ బొమ్మలాంటివే కొనుక్కునేది. అలా స్కార్లెట్ అవి కొని కొని ఇల్లంతా అవే బొమ్మలతో నింపేసింది. అలా స్కార్లెట్ కు ఆ బొమ్మల్ని కొనటం అలవాటైపోయింది. అలా ఆ చిన్నారి ఇల్లు లిప్‌బామ్‌ ఎగ్జిబిషన్‌లా మారిపోయింది. ఎక్కడ చూసినా అవే బొమ్మలు. లైట్ పింక్ కలర్ లో ఉండే ఆ బొమ్మల్ని స్కార్లెట్ చక్కగా తన రూమ్ లో సర్దుకుంటుంది. అలా అదో ఎగ్జిబిషన్ లా కనిపిస్తుంది.

Read more : Guinness World Record: ఆమెతో పెట్టుకోవద్దు..మజిల్స్ తో పిప్పి చేసిపారేస్తది.. 

అలా ఆరేళ్ల స్కార్లెట్‌ యాష్లీచెంగ్‌ ఆరేళ్లలో 3,388 రకాల లిప్‌బామ్‌లు సేకరించి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్ సొంతం చేసుకుంది. తన సరదా ఇలా గిన్నిస్ రికార్డు తెచ్చిపెడుతుంది ఆమె పేరెంట్స్ కూడా అనుకోలేదు.కానీ సరదాయే రికార్డు క్రియేట్ చేసేలాచేసింది.స్కార్లెట్‌ అన్నీ ఒకే రకం లిప్‌బామ్‌లు సేకరించలేదు. ఒక్కోటీ ఒక్కో రకం. దేనికదే స్పెషల్ లుక్ లో ఉంటుంది. కొత్త మోడల్ వస్తే చాలు అది స్కార్లెట్ చేతిలో ఉండాల్సిందే. అలా స్కార్లెట్ అభిరుచికి తగినట్లుగా డిఫరెంట్ కలర్స్, టెక్చర్, షేప్, ఫ్లేవర్, ఫంక్షన్, సువాసన. అన్నీ వేటికవే డిఫరెంట్‌గా ఉండేవి కొనేది.

Read more : World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..

స్కార్లెట్‌ తన సోదరి కేలిన్‌తో కలిసి…లిప్ బామ్స్ సేకరించడం మొదలుపెట్టింది. బయటకు వెళ్లితే చాలు..ఓ కొత్త బామ్‌ ఇంటికి తేవాల్సిందే. కరోనా టైమ్‌లో కూడా స్కార్లెట్ అవి కొనటం మానలేదు అంటే అవంటే ఆ చిన్నారికి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అలా ఏకంగా 3,388 రకాల డిఫరెంట్ టైప్ లిప్‌బామ్‌లు కొన్నది. ఆ బొమ్మలతో ఏప్రిల్ 24, 2021లో స్కార్లెట్… ఈ గిన్నీస్ రికార్డ్ సాధించింది. రికార్డు కోసం ఆమె అలా వాటిని కొనలేదు. కాబట్టి వాటిని ఇంకా కొంటునే ఉంది.

Read more : 3 రోజుల 14 గంటల్లో ప్రంపంచాన్ని చుట్టేసి గిన్నిస్ రికార్డ్ సాధించిన మహిళ

దీనిపై ఆరేళ్ల స్కార్లెట్ మాట్లాడుతు..లిప్ బామ్‌లు సేకరించడం తనకు హాబీ అనీ..వాటిని చూస్తే చాలు కొనేయాలని అనిపిస్తుందని..వాటి రుచి, ఫీల్ అన్నీ నచ్చాయని చెబుతోంది. స్కార్లెట్‌కి తొలి లిప్ బామ్‌ను ఆమె నాన్నమ్మ కొని ఇచ్చిందట. ఇక అప్పటి నుంచి అవంటే ఇష్టంతో అలా కొంటు కొంటూ రికార్డుకెక్కెంది.ఇప్పుడు తను సేకరించిన లిప్‌బామ్‌లని చూసుకొని ఈ చిన్నారి ఎంతో సంబరపడిపోతోంది. మురిసిపోతుంది. ఆ చిన్నారి సరదా గిన్నిస్ రికార్డు సాధించటమే కాకుండా ఏకంగా వారి ఇంట్లోనే సొంతంగా లిప్ బామ్‌లు తయారుచేయడం ప్రారంభించేలా చేసింది. అలా తయారుచేసిన లిప్ బాములను ఫ్రెండ్స్, బంధువులకు ఫ్రీగా ఇస్తుంటారట.

ట్రెండింగ్ వార్తలు