Small Plane Crashes Into Car : బాబోయ్.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన విమానం… వీడియో వైరల్
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని మెక్ కిన్నేలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెక్ కిన్నే ఫైర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం..
- Harish Thanniru
- Published on- November 12, 2023 / 11:43 AM IST
Small Plane
Small Plane Crashes: రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, అమెరికాలో ఓ చిన్నపాటి విమానం రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చి ఢీకొట్టింది. విమానం రన్ వేపై నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నంలో అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని మెక్ కిన్నేలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. మెక్ కిన్నే ఫైర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం.. స్థానిక ఏరో కౌంటీ ఎయిర్ పోర్టులో సింగిల్ ఇంజన్ లాంకైర్ ఐవీ-పీ ప్రాప్ జెట్ విమానం రన్ వే పై నుంచి టేకాఫ్ అయింది. నడుపుతున్న క్రమంలో పైలట్ రన్ వే చివరిలో ఆపలేక పోయాడు. ఫలితంగా విమానం కంచె గుండా ఈస్ట్ బౌండ్ వర్జీనియా పార్క్ వైపుకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు విమానంలో ఉండగా.. ఒకరు కారులోని వ్యక్తి.
Also Read : Guvvala Balaraju : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి
ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అధికారులు వారికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటలపాటు మూసివేశారు.
