Palvai Sravanthi : బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి.. రేవంత్, రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని, మునుగోడులో కాంగ్రెస్ కు ఎవరూ దిక్కులేనప్పుడు స్రవంతిని నిలబెట్టారని, ఆమె పోటీచేసినందుకే కాంగ్రెస్ కు ఆ మాత్రం ఓట్లు వచ్చాయని కేటీఆర్ అన్నారు.

Palvai Sravanthi : బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి.. రేవంత్, రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Palvai Sravanthi

Minister KTR : దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆమెకు వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవారికి గుర్తింపు లేదని అన్నారు. గౌరవం లేనిచోట ఉండాల్సిన అవసరం లేదని, చాలా ఆలోచించిన తరువాతనే బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. నేను పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదని చెప్పిన ఆమె.. తెలంగాణ అభివృద్ధి సాధ్యం బీఆర్ఎస్ పార్టీతోనేనని స్రవంతి అన్నారు.

Also Read : Guvvala Balaraju : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి

పాల్వాయి స్రవంతికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు దూషించుకొని మళ్లీ ఇప్పుడు ఒక్కటైపోయారని కేటీఆర్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు పార్టీలు మారుతున్నారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఎందుకు బీజేపీలోకి మారాడో.. మునుగోడు ఉపఎన్నిక ఎందుకు తెచ్చాడో.. మళ్లీ కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లాడో అంటూ రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లోకి రావడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. దివంగతనేత గోవర్ధన్ రెడ్డి సేవల్ని కొనియాడారు.

Also Read : Women Hulchul : ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీని టెన్షన్ పెట్టిన యువతి

తెలంగాణ ఉద్యమానికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సహకరించారని కేటీఆర్ తెలిపారు. పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని, మునుగోడులో కాంగ్రెస్ కు ఎవరూ దిక్కులేనప్పుడు స్రవంతిని నిలబెట్టారని, ఆమె పోటీచేసినందుకే కాంగ్రెస్ కు ఆ మాత్రం ఓట్లు వచ్చాయని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ లో స్రవంతికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాత, కొత్త తేడా లేకుండా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని, రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని కేటీఆర్ అన్నారు.