Women Hulchul : ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీని టెన్షన్ పెట్టిన యువతి

మోదీ ప్రసంగిస్తుండగా యువతి  స్తంభం పైకెక్కడంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మోదీతోపాటు వేదికపై ఉన్న నేతలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Women Hulchul : ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీని టెన్షన్ పెట్టిన యువతి

Women Hulchul MRPS Public Meeting

Women Hulchul – MRPS Public Meeting : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ఓ యువతి ప్రధాని మోదీని టెన్షన్ పెట్టారు. మోడీ ప్రసంగిస్తుండగా యువతి విద్యుత్ లైట్లు అమర్చి ఉన్న స్తంభం పైకెక్కి యువతి హల్ చల్ చేశారు. స్తంభంపై నుంచి ఆ యువతి చేతులతో ప్రధానికి ఏదో చెబుతున్నట్లు కనిపించింది.

దీంతో ప్రధాని మోదీ యువతిని కిందికి దిగాలని కోరారు. “నేను నీవు చెప్పేది వింటాను” అని అన్నారు. ‘నీవు స్థంభం పైకెక్కడం మంచి పద్ధతి కాదు’ అని అన్నారు. దయచేసి కిందికి దిగి రావాలని యువతిని కోరారు. ‘నేను మీ కోసమే ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు.

PM Modi : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు : ప్రధాని మోదీ

మోదీ ప్రసంగిస్తుండగా యువతి  స్తంభం పైకెక్కడంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వేదికపై ఉన్నవారితోపాటు సభకు వచ్చిన జనానికి చెమలు పట్టాయి. మోదీతోపాటు వేదికపై ఉన్న నేతలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రధాని మోదీ విజ్ఞప్తితో యువతి కిందకు దిగారు. చివరకు ఆమె కిందికి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అంతకముందు మోదీ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎస్సీల పోరాటానికి త్వరలోనే ముగింపు పలుకుతామని చెప్పారు. ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు.

Electric Shock : ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో షాట్ సర్క్యూట్.. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా కాలి పోయిన విద్యుత్ వైర్లు

అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.బీఆర్ఎస్, ఆప్ రెండూ కలిసి అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దళిత ద్రోహి పార్టీలని విమర్శించారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. మందకృష్ణ 30 ఏళ్లుగా ఒకే లక్ష్యంతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.

సాధారణంగా అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయని కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో అవినీతి విషయంలో కలిసి పని చేస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు.

Manda Krishna: మోదీని పట్టుకుని భోరున విలపించిన మంద కృష్ణ

ఇలా అవినీతి కోసం ప్రభుత్వాలు కలిసి పని చేయడం మొదటిసారి చూస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద మద్దతుదారు అని పేర్కొన్నారు. అలాంటి ఆప్ తో కలిసి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతోందన్నారు.