కరోనా వైరస్.. ప్రపంచానికి కొత్త కొత్త సవాళ్లు విసురుతుంది. ఈ వైరస్ కారణంగా రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతుండగా… బాధితులు బాధలు పడుతూనే ఉన్నారు. అయితే.. ఒక్కసారి కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వ్యక్తికి మళ్లీ కోవిడ్-19 రాదనుకుంటే అది పొరపాటే అంటున్నారు డాక్టర్లు.
కొరోనావైరస్ క్లియర్ అయిందని అనుకున్న 91 మంది రోగులకు మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సోకినవారి శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ఇతరుల నుంచి వైరస్ సోకకుండా శరీరంలోనే తిరిగి మళ్లీ పుట్టిందా? అనే కోణాన్ని పరిశీలిస్తున్నట్లు డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ సెంటర్స్ డైరెక్టర్ జియాంగ్ ఇయున్ క్యెయాంగ్ చెప్పారు.
ఇలా ఎందుకు జరుగుతోందో అర్థంకావట్లేదని, దీనిపై పరిశోధనలు జరుగుతున్నట్లు చెప్పారు. రెండోసారి కొవిడ్ సోకిన వారి సంఖ్య దక్షిణ కొరియాలో సోమవారం నాటికి 51గా ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 91కి చేరుకుంది. ఆ దేశంలో మొత్తం 10,480 మంది వైరస్ బారినపడగా 7,200 మంది కోలుకున్నారు. రెండోసారి కరోనా వైరస్ సోకినవారి సంఖ్య మాత్రం పెరుగుతోందని చెబుతున్నారు.
మరోవైపు, రక్త నమూనా పరీక్షల్లో కొందరి ఫలితాలు తప్పుగా వచ్చాయేమోననే సందేహం కూడా వ్యక్తం అవుతుంది. కోలుకున్నవారిలోనూ వైరస్ అవశేషాలు ఉంటాయని పాజిటివ్ వచ్చినప్పటికీ ఇతరులకు సంక్రమించక పోవచ్చని.. ఇవి అంత ప్రమాదకరం కాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విాషయాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.(ఆఫ్రికా అడవుల్లో జీబ్రాతో డాంకీ ఎఫైర్ : జోంకీ జననం )