‌ నాసాలో కొత్త శకం.. 4 వ్యోమగాములతో అంతరిక్షంలోకి క్రూ డ్రాగన్ రాకెట్‌

  • Publish Date - November 16, 2020 / 11:33 AM IST

SpaceX launches 4 astronauts : స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్ష సంస్థ మరోసారి మానవసహిత రాకేట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు ప్రయాణమయ్యారు. స్పేస్‌ ఎక్స్‌, నాసాలు సంయుక్తంగా చేపట్టిన తొలి మానవసహిత ఆపరేషనల్‌ మిషన్‌ ఇదే.

అమెరికాకు చెందిన వ్యోమగాములు మైకెల్‌ హాప్కిన్స్‌, విక్టర్‌ గ్లోవర్‌, శనాన్‌ వాకర్‌, జపాన్‌కు చెందిన సోచి నగూచీలు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు పయనమయ్యారు. ఆదివారం రాత్రి 7:27 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి రాకేట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.. ఈ రాకెట్‌ ఐఎస్‌ఎస్‌కు చేరడానికి ఇరవై ఏడున్నర గంటల సమయం పడుతుంది.
డ్రాగన్‌ క్యాప్సూల్‌లో మొత్తం ఏడుగురు అస్ట్రోనాట్స్‌ ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వెళ్లిన అస్ట్రోనాట్స్‌ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఇద్దరు రష్యన్‌, ఒక అమెరికన్‌ అస్ట్రోనాట్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ అస్ట్రోనాట్స్‌ తిరిగి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో భూమికి తిరిగిరానున్నారు.

2011లో నాసా స్పేస్‌ షటిల్స్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించడంతో అప్పటి నుంచి రష్యా సూయాజ్‌ రాకెట్స్‌, ఇతర ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థలపై ఆధారపడి అస్ట్రోనాట్స్‌ను అంతరిక్షంలోకి పంపుతుంది. స్పేస్‌ ఎక్స్‌ ‌ సంస్థ నాసా కోసం మొట్టమొదటి సారిగా పూర్తి స్థాయిలో ఈ వాహక నౌకను సిద్ధం చేసింది. స్పేస్‌ ఎక్స్‌కి ఇది రెండో ప్రయోగం. మే 30న మొదటి ప్రయోగాన్ని చేపట్టింది.


https://10tv.in/nasa-and-voyager-2-launched-in-1977-make-contact-over-11-6bn-miles/
అమెరికాలో మానవ అంతరిక్ష పరిశోధనలో ఇది కొత్త శకం అంటూ సైంటిస్టులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లు స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎలన్‌ మస్క్‌ అన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో అక్టోబర్‌కు ముందు నుంచే అస్ట్రోనాట్స్‌ను వారి కుటుంబంతో సహా క్వారంటైన్‌లో ఉంచారు.


ఈ సారి కెన్నడీ స్పేస్‌ సెంటర్‌కు ఎవరినీ ఎక్కువగా అనుమతించలేదు. స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్ష సంస్థ మరోసారి మానవసహిత రాకేట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడాన్ని గ్రేట్‌ అంటూ అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్‌, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్లు చేశారు.