Bangladesh Hindus : బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్‌లా మారుతోందా? హిందువులపై దాడుల వెనక కుట్ర ఉందా?

బంగ్లాదేశ్ ఇవాళ ఓ దేశంగా ఉందంటే అది భారత్ చేసిన సాయమే. అలాంటిది భారత్ టార్గెట్ గా ఇప్పుడు బంగ్లా విషం కక్కుతోంది.

Bangladesh Hindus : బంగ్లాదేశ్ లో అరాచకం రాజ్యమేలుతోంది. హిందువులు, హిందువుల దేవాలయాలు టార్గెట్ గా దాడులు కొనసాగుతున్నాయి. హిందువుల కోసం పోరాడుతున్నారనే మంటతో ఇస్కాన్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. మరో ఇద్దరు పూజారులను అదుపులోకి తీసుకుంది బంగ్లాదేశ్. అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది? ఈ దారుణాల వెనక అసలు కారణం ఏమిటి? భారత్ మీద అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారా? ఇంత జరుగుతున్నా బంగ్లా సర్కార్ మౌనం ఎందుకు? బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ లా మారుతోందా? దాడుల వెనుక అసలు కుట్ర వేరే ఉందా?

మతపరమైన హింసకు బంగ్లాదేశ్ కేరాఫ్ గా మారుతోంది. షేక్ హసీనా ప్రధాని పదవిని వదిలిపెట్టి ఇండియాలో తల దాచుకున్నప్పటి నుంచి బంగ్లాదేశ్ లోని కొందరు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. గత 5 నెలల్లో హిందువులపై దాదాపు 200లకు పైగా దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 9మంది చనిపోగా.. వందల సంఖ్యలో హిందువులు గాయపడ్డారు. భారీ ఎత్తున హిందువుల ఆస్తులు విధ్వంసానికి గురయ్యాయి.

నోబెల్ శాంతి బహుమతి విజేత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా.. ఈ దాడులు పెరిగాయే తప్ప తగ్గినట్లు ఏ మాత్రం కనిపించడం లేదు. ఇస్కాన్ మాజీ అధికార ప్రతినిధి, బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ నేత చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ తో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణదాస్ అరెస్ట్ వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ.. చటోగ్రామ్ లో మరో ఇద్దరు ఇస్కాన్ సభ్యులను అరెస్ట్ చేశారు.

బంగ్లాదేశ్ ఇవాళ ఓ దేశంగా ఉందంటే అది భారత్ చేసిన సాయమే. అలాంటిది భారత్ టార్గెట్ గా ఇప్పుడు బంగ్లా విషం కక్కుతోంది. అసలు భారత్ ను డైరెక్ట్ గా ఏమీ చేయలేక.. శత్రు దేశాలు బంగ్లాలో మంటలు రేపుతున్నాయా? ఈ దాడుల వెనక పాక్, చైనా హస్తం ఉందా? అసలు బంగ్లా మనకెందుకు అంత కీలకం? బంగ్లాలో అరాచకాలకు చెక్ పెట్టేది ఎలా?

పూర్తి వివరాలు..

Also Read : భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య తేడా ఏమీ లేదు: మెహబూబా ముఫ్తీ కామెంట్ల దుమారం