Chinas Defence Technology : టెక్నాలజీలో అమెరికాను సవాల్ చేస్తోంది చైనా. మోడ్రన్ వెపన్స్ ని తయారు చేసి రక్షణ రంగంలో ప్రపంచాన్ని శాసించాలని వ్యూహం రచిస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద సైనిక వ్యవస్థ, ఆయుధ సంపత్తిని కలిగిన దేశాల్లో చైనా ఒకటి. పొరుగు దేశం ఎప్పటికప్పుడు తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఆధునిక సాంకేతికతను జోడిస్తోంది. తాజాగా చైనా ఎయిర్ షో లో ప్రదర్శించిన అధునాతన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి 5జీ ఫైటర్ జెట్స్ కావడం విశేషం. ఇప్పటికే ఇటువంటివి అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చైనా కూడా తయారు చేయటంతో అగ్రరాజ్యానికి ఫైటర్ జెట్లలోనూ పోటీ ఇస్తోంది డ్రాగన్ కంట్రీ.
అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న దేశం చైనా. వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన చైనా.. ఇప్పుడు రక్షణ రంగంలో టెక్నాలజీని అంది పుచ్చుకుంటూ సైన్యాన్ని కూడా ఆధునీకరించే పనిలో ఉంది. దక్షిణ చైనాలో జుహై ఎయిర్ షో ఇందుకు వేదికగా నిలిచింది. చైనా ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఏరో స్పేస్ ఎగ్జిబిషన్ ను నిర్వహించింది. ఇందులో తన దగ్గర అత్యంత శక్తిమంతమైన ఫైటర్ జెట్ అస్త్రాలు ఉన్నాయని ప్రపంచానికి చూపే ప్రయత్నం చేసింది చైనా.
భారీ యుద్ధ విమానాలను, మిస్సైల్స్, డ్రోన్లను ఈ ప్రదర్శనలో పెట్టింది. ఆధునిక సాంకేతికతను జోడించి తయారు చేసిన పలు రక్షణ రంగ విమానాల గురించి ఇప్పుడు ప్రపంచ దేశాలు చెప్పుకునేలా జుహై ఎయిర్ షో ను నిర్వహించింది చైనా.
చైనా.. ఏటా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తోంది. తమ దగ్గరున్న యుద్ధ విమానాలు, ఆయుధాల్లో అప్ డేటెడ్ వర్షన్ ని ప్రతీ ఏటా ప్రదర్శనకు పెడుతూ ఉంటుంది. అయితే, 2019లో కొవిడ్ సమయాన దీనికి బ్రేక్ పడింది. ఈ ఏడాది నుంచి మళ్లీ ఎయిర్ షో ను తిరిగి ప్రారంభించింది. దీంతో తమ దగ్గరున్న అత్యాధునికి ఆయుధ సంపత్తిని ప్రపంచానికి తెలిసేలా ఎయిర్ షో లో ప్రదర్శించింది.
అగ్రరాజ్యాలకు యుద్ధ సామాగ్రిలో తామేమీ తక్కువ కాదని, ఫుల్ అప్ డేటెడ్ వెర్షన్ తో ఉన్నామన్న సంకేతాలు ఇవ్వడమే డ్రాగన్ ప్రధాన లక్ష్యం. దీంతో పాటు ప్రత్యర్థి దేశాలకు కూడా వార్నింగ్ బెల్ ఇచ్చినట్లు ఉంటుందని జిన్ పింగ్ భావిస్తున్నారట.
Also Read : ట్రంప్ టీమ్ రెడీ..! ప్రో ఇండియన్స్‌కి కీలక పదవులు..