రెడ్ బుక్ రెడీ..! ట్రంప్ శత్రువులు ఎవరెవరు? రెడ్ బుక్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి?

ఏ విషయాన్ని అంత ఈజీగా వదలని ట్రంప్.. ఎవరెవరిని ఏం చేయబోతున్నారా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

Donald Trump Red Book : తిప్పి తిప్పి చెప్పడం.. తిట్టకుండా చెప్పడం ట్రంప్ కు తెలియదు. మాట ఘాటుగా ఉంటుంది. మంటలు పుట్టిస్తుంది. ముక్కు సూటి తనానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటారు ట్రంప్. అలాంటి ట్రంప్ ఇప్పుడో శత్రువుల లిస్ట్ రెడీ చేశారు. పాలిటిక్స్ నుంచి మీడియా, సినిమా వరకు ఎవ్వరినీ వదిలేది లేదని, ఇట్స్ రివెంజ్ టైమ్ అనేందుకు రెడీ అయ్యారు ట్రంప్. ఇంతకీ ట్రంప్ కు చిరాకు తెప్పించింది ఎవరు? ఎవరిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది?

సైకాలజీకి అందని క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని. అలాంటి పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపిస్తారు ట్రంప్. రెండు శతాబ్దాల అమెరికా చరిత్రలో ఎప్పుడూ కనని, వినని.. ఎవరితోనూ కనీసం పొంతన లేని అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు, ఏది అనిపిస్తే అది చేసేస్తారు. దూకుడైన వ్యక్తిత్వం, అన్నింటికి మించి వివాదాస్పద వైఖరి.. ఆయనను సమ్ థింగ్ డిఫరెంట్ గా మార్చేశాయి. ట్రంప్ ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తారు. దాపరికం స్పెల్లింగ్ కూడా తెలియదు ఆయనకు. ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం. ఆ గుణమే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.

ఏ విషయాన్ని అంత ఈజీగా వదలని ట్రంప్.. ఇప్పుడు శత్రువుల లిస్టు కూడా తయారు చేశారట. రెండో టర్మ్ లో వారందరికీ చుక్కలు చూపిస్తారా అనే చర్చ మొదలైంది. అవమానిస్తే ప్రతీకారం తీర్చుకునే వరకు వదిలి పెట్టరు ట్రంప్. బరాక్ ఒబామా అవమానించారని.. పట్టుబట్టి అమెరికా అధ్యక్షుడు అయిన రకం ట్రంప్. అమెరికా అధ్యక్షుడు కరస్పాండెన్స్ విందు పేరుతో ఓ పార్టీ ఇస్తుంటారు. దేశంలోని ప్రముఖులను దీనికి ఆహ్వానిస్తారు.

అప్పటికే వ్యాపారవేత్త, టీవీ షోలతో సెలెబ్రిటీగా మారిన డొనాల్డ్ ట్రంప్.. 2011 ఏప్రిల్ లో విందుకు అటెండ్ అయ్యారు. ఈ పార్టీలో ట్రంప్ పై సెటైర్లు వేశారు ఒబామా. బికినీలు వేసుకున్న అమ్మాయిలతో టీవీ షోల గురించి ప్రస్తావిస్తూ అవమానించారు. ఒబామా వెటకారం విని ప్రతీ ఒక్కరూ పడి పడి నవ్వుతుంటే.. ట్రంప్ మాత్రం తల వంచుకుని ఉండిపోయారు. కట్ చేస్తే 2016లో బలమైన హిల్లరీ క్లింటన్ ను ఓడించి మరీ వైట్ హౌస్ లో అడుగుపెట్టారు ట్రంప్.

బైడెన్ నుంచి కమలా, ఒబామా వరకు.. అందరి పేర్లతో ట్రంప్ శత్రువుల లిస్ట్ రెడీ చేసినట్లు కనిపిస్తోంది. ప్రచారంలో ట్రంప్ చెప్పిన ప్రతీ మాట.. చేసిన ప్రతీ ఆరోపణ.. ఇప్పుడు వాషింగ్టన్ వీధుల్లో మళ్లీ రీసౌండ్ ఇస్తోందట. ఏ విషయాన్ని అంత ఈజీగా వదలని ట్రంప్.. ఎవరెవరిని ఏం చేయబోతున్నారా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇంతకీ ఆ లిస్టులో ఉన్నది ఎవరు? ఒక్కొక్కరికి మోతెక్కిపోవడం ఖాయమా? ట్రంప్ ఎలా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది?

 

Also Read : ట్రంప్ వచ్చాడు.. యుద్ధాలు ఆపేస్తాడా? అసలు యుద్ధాలు ఆపడం ఆయనకు సాధ్యమేనా?