Bitcoin : అసలేంటి బిట్ కాయిన్? ఇందులో పెట్టుబడులు పెట్టడం సేఫేనా?

పూర్వం వస్తు మార్పిడి జరిగేది. ఈ తర్వాత గోల్డ్, సిల్వర్ కాయిన్లు వచ్చాయి.

Bitcoin : బిట్ కాయిన్.. ఏ దేశపు కరెన్సీ కాదు. ఏ దేశంలోనూ చట్టబద్ధత లేదు. అయినా సరే ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. అసలీ బిట్ కాయిన్ ఎలా పుట్టింది? బిట్ కాయిన్ సంపాదించాలంటే ఎలా? ఇందులో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా? అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ ఏలేయడం ఖాయమా? ఏం జరగబోతోంది.. మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్న భయాలేంటి?

ద్రవ్య మార్పిడిలో ప్రపంచ దేశాల్లో ఎప్పటికప్పుడు చాలా మార్పులు వచ్చాయి. పూర్వం వస్తు మార్పిడి జరిగేది. ఈ తర్వాత గోల్డ్, సిల్వర్ కాయిన్లు వచ్చాయి. 1792లో తొలిసారిగా పేపర్ రూపంలో డాలర్ ను ద్రవ్య యూనిట్ గా ప్రవేశపెట్టింది అమెరికా. ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలు దేశీయంగా చెల్లుబాటు అయ్యేలా.. నిర్ధిష్ట పేపర్ కరెన్సీని చెలామణిలోకి తెచ్చాయి. ఇలా పూర్వం నుంచి ఇప్పటివరకు కరెన్సీల్లో చాలానే మార్పులు వచ్చాయి.

ఇప్పుడు నడుస్తోంది డిజిటల్ యుగం. ఏం జరిగినా ఏం చేసినా టెక్నాలజీతోనే. అలా పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ. ఫోన్ పే, గూగుల్ పే లాగా ఇదో వ్యాలెట్ అంతే. క్రిప్టోగ్రఫీ కరెన్సీ, ఎన్ క్రిప్షన్ కరెన్సీ అంటారు క్రిప్టో కరెన్సీని. క్రిప్టోగ్రఫీ ఫార్ములాతో బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి దీన్ని తయారు చేస్తారు. ఇది ఏ దేశానికి చెందినది కాదు. క్రిప్టో కరెన్సీలపై ఎవరి నియత్రణ ఉండదు. క్లియర్ గా చెప్పాలంటే వస్తువు మీద పెట్టుబడి పెట్టడం లాంటిది. అయితే, ఫిజికల్ గా కనిపించదు అంతే. వరల్డ్ వైడ్ గా 6వేలకు క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ఆ విలువలో సగానికిపైగా బిట్ కాయిన్ ది.

సతోషి నకమొటో అనే వ్యక్తి 2008లో బిట్ కాయిన్ కరెన్సీని క్రియేట్ చేశారు. అతడు ఎక్కడున్నాడో.. అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు ఎవరికీ. ఆగస్టు 18 2008న బిట్ కాయిన్ డాట్ ఓర్జీ అనే సైట్ ప్రారంభించాడు. సతోషి రూపొందించిన సెక్యూర్ హ్యాష్ అల్గారిథమ్ 256 ద్వారా బిట్ కాయిన్ వచ్చింది. ఈ అల్గారిధమ్ తో కేవలం 2కోట్ల 10 లక్షల బిట్ కాయినట్లు మాత్రమే క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతం కోటి 80 లక్షల బిట్ కాయిన్లు చెలామణిలో ఉన్నట్లు టాక్. మైనింగ్ చేయడం, వెబ్ సైట్స్ ద్వారా కొనడం.. బిట్ కాయిన్ పొందే మార్గాలివే.

క్రిప్టో కరెన్సీ పై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మైనింగ్ ద్వారా కేవలం 2 కోట్ల 10 లక్షల బిట్ కాయిన్లకు మాత్రమే ఛాన్స్ ఉండటం, అన్ని దేశాల్లో క్రమంగా చెలామణి ఎక్కువ కావటంతో డిమాండ్ పెరుగుతోంది. బిట్ కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తులు ఉండరు. వీటితో జరిగే వ్యవహారాలు అత్యంత పారదర్శకం. అయితే, వీటిలో పెట్టుబడి ఎప్పటికీ సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బిట్ కాయిన్ అంటే బబుల్ లాంటిది. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవడం జరుగుతుంటాయి దీని వల్ల.

బిట్ కాయిన్ ను ఓ ఆస్తిలా చూడటానికి వీలుండదు. ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఊరుకుంటే బిందాస్ అనుకునే పరిస్థితి ఉండదు. అప్పటికప్పుడు ఆ సమయానికి ఓ పెట్టుబడికి బిట్ కాయిన్ అవకాశం మాత్రమే. ఏ బ్యాంకు కూడా అధికారికంగా ధృవీకరించకపోవడంతో బిట్ కాయిన్ మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అటు వర్చువల్ మనీ కావడంతో హ్యాకింగ్ ప్రమాదానికి ఛాన్స్ ఉందనే భయాలు ఉన్నాయి.

పూర్తి వివరాలు..

Also Read : అదానీపై అమెరికాలో లంచం కేసు.. అసలు ఎవరికి లంచం ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు?