నాసా వ్యోమగామిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు సునీత విలియమ్స్. ఆమెను ఆదర్శంగా తీసుకుని చాలా మంది అంతరిక్ష పరిశోధనా కేంద్రాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్నారు.
నాసాలో ఉద్యోగులకు జీతాలు ఎంత ఉంటాయో తెలుసా? సునీత విలియమ్స్‌కి జీఎస్-15 కింద వార్షిక జీతం సుమారు $152,258 (ఏడాదికి సుమారు రూ.1.26 కోట్లు). నాసా వ్యోమగామిగా ఆమెకు ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి.
నాసాలో జీతాలు పోస్టులు, అనుభవం వంటి ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి. నాసా అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి జనరల్ షెడ్యూల్ (జీఎస్) పే స్కేల్‌ను అనుసరించి వారికి జీతాలు అందుతాయి. నాసా ఉద్యోగులకు సాధారణంగా జీఎస్-7 నుంచి జీఎస్-15 పరిధి మధ్యలో జీతాలు వస్తాయి.
Also Read: కాంగ్రెస్‌లో సడెన్ మార్పులు..! మంత్రులంతా ఏకతాటిపైకి వచ్చారా? మార్పు వెనుక మీనాక్షి మంత్రాంగం ఉందా?
ఈ పే స్కేళ్ల వారీగా వారికి అందే జీతాలు (2024లోని అంచనాల ప్రకారం వార్షిక ఆదాయం)
- జీఎస్-7 ఉద్యోగులకు $45,000 – $60,000 (సుమారు రూ.52,16,900)
- జీఎస్-9 ఉద్యోగులకు $55,000 – $75,000 (సుమారు రూ.65,21,130)
- జీఎస్-11 ఉద్యోగులకు $70,000 – $90,000 (సుమారు రూ.78,25,356)
- జీఎస్-12 ఉద్యోగులకు $85,000 – $110,000 (సుమారు రూ.95,64,324)
- జీఎస్-13 ఉద్యోగులకు $100,000 – $130,000 (సుమారు రూ.1,13,03,292)
- జీఎస్-14 ఉద్యోగులకు $120,000 – $150,000 (సుమారు రూ.1,30,42,260)
- జీఎస్-15 ఉద్యోగులకు $140,000 – $180,000 (సుమారు రూ.1,56,50,712)
- ఎస్‌ఈఎస్ (సీనియర్ ఎగ్జిక్యూటివ్) $160,000 – $200,000+ (సుమారు రూ.1,73,89,680+)
- సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డైరెక్టర్లు) సుమారు రూ.1,73,89,680+ సంపాదించవచ్చు
ఏయే ఉద్యోగాలకు ఎంతెంత జీతాలు
- ఏరోస్పేస్ ఇంజనీర్లకు: $90,000 – $150,000 (సుమారు రూ.1,30,42,260) జీతం ఉంటుంది
- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు $80,000 – $140,000 (సుమారు రూ.1,21,72,776) జీతం ఉంటుంది
- వ్యోమగాములకు $90,000 – $150,000 (జీఎస్-12 నుండి జీఎస్-15 వరకు.. సుమారు రూ.95,64,324 నుంచి సుమారు రూ.1,56,50,712 మధ్య ఉంటుంది)
- శాస్త్రవేత్తలు (భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం మొదలైనవి): $80,000 – $140,000 (సుమారు రూ.1,21,72,776) జీతం ఉంటుంది
- అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి