×
Ad

Sunita Williams : రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్.. 27ఏళ్ల కెరీర్‌లో మూడు మిషన్లు.. 608రోజులు.. తొమ్మిది సార్లు స్పేస్‌వాక్.. రికార్డులెన్నో..

Sunita Williams : 27ఏళ్ల నాసా ప్రయాణానికి 60ఏళ్ల సునీత విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. సుదీర్ఘ ప్రయాణంలో ఆమె మొత్తం మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 608 రోజులు ఆమె అంతరిక్ష కేంద్రంలో గడిపారు. తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్షంలో మారథాన్‌లో పాల్గొన్న తొలి వ్యక్తిగానూ ఆమె గుర్తింపు పొందారు.

Sunita Williams

  • నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కీలక నిర్ణయం.
  • నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటన.
  • గతేడాది డిసెంబరు 27 నుంచే అమల్లోకి వచ్చిందన్న నాసా.
  • 27ఏళ్లలో మూడు మిషన్లు.. 608 రోజులు.. తొమ్మిది సార్లు స్పేస్ వాక్
  • అంతరిక్షంలో మారథాన్‌లో పాల్గొన్న తొలి వ్యక్తిగానూ ఆమెకు గుర్తింపు

Sunita Williams : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా నుంచి ఆమె రిటైర్మెంట్ అయ్యారు. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. గతేడాది సెంబర్ 27 నుంచే ఇది అమల్లోకి వచ్చిందని నాసా పేర్కొంది.

Also Read : Marriyum Aurangzeb : పాకిస్థాన్‌ను షేక్ చేస్తున్న లేడీ పొలిటీషియన్.. బాబోయ్ ఇంత యంగ్‌గా ఎలా మారిపోయింది.. అసలు ఎవరీ మరియం ఔరంగజేబ్?

27ఏళ్ల నాసా ప్రయాణానికి 60ఏళ్ల సునీత విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. సుదీర్ఘ ప్రయాణంలో ఆమె మొత్తం మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 608 రోజులు ఆమె అంతరిక్ష కేంద్రంలో గడిపారు. తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్షంలో మారథాన్‌లో పాల్గొన్న తొలి వ్యక్తిగానూ ఆమె గుర్తింపు పొందారు. 2024 జూన్ 5న సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు వారంరోజుల రోదసి యాత్ర చేపట్టారు. సాంకేతిక సైమస్య కారణంగా వారు దాదాపు తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

సునీతా విలియమ్స్ మూడు మిషన్లలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 2006 డిసెంబర్ 9న స్పేస్ షటిల్ డిస్కవరీ (STS-116) ద్వారా అంతరిక్షంలోకి తొలి ప్రయాణం చేశారు.ప ఎక్స్‌పిడిషన్ 14/15లో ఫ్లైట్ ఇంజినీర్‌గా నాలుగు స్పేస్ వాక్‌లు చేశారు. 2012 జూలై 14న కజకిస్తాన్‌లోని బయ్‌కోనూర్ నుంచి రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. 127రోజుల పాటు ఎక్స్‌పిడిషన్ 32/33లో సేవలందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమ్మోనియా లీక్ మరమ్మతులు సహా కీలక పనులు చేశారు. 2024లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా 2024 జూన్ నెలలో సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. ఎక్స్‌పిడిషన్ 71/72లో భాగంగా 286 రోజులు అంతరిక్షంలో గడిపి 2025 మార్చిలో భూమిపైకి తిరిగొచ్చారు.

దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా జిల్లా, ఝులాసన్ గ్రామం వాసి. 1958లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు. సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లోవీస్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో సునీత చిన్న కుమార్తె. ఓహియోలో జన్మించిన సునీత.. మాసాచుసెట్స్‌ను తన స్వస్థలంగా భావిస్తుంటారు.

అంతరిక్షం నా ప్రియమైన స్థలం. నాసాలో 27ఏళ్ల కెరీర్ అద్భుతంగా సాగింది అని సునీత పేరుతో ఒక ప్రకటన వెలువడింది. నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ మాట్లాడుతూ.. సునీత విలియమ్స్ మానవ అంతరిక్ష యాత్రలో మర్గదర్శకురాలు అన్నారు. ఆమె కృషి భవిష్యత్ యాత్రలకు పునాది లాంటిదని ప్రశంసించారు.