Crime: భలే భలే మగాడివోయ్.. డ్రైనేజీలో దాక్కున్న దొంగ.. అయినా అందులో ఉన్నాడని ఎలా గుర్తించారో తెలుసా?

అయినప్పటికీ అతడిని చాలా సులువుగా గుర్తించారు పోలీసులు. దొంగ ఆచూకీని కనిపెట్టడం కోసం పోలీసులు..

Crime - USA

Crime – USA: ఓ ఇంట్లో నుంచి విలువైన వస్తువును చోరీ చేయడానికి ప్రయత్నించాడో దొంగ. ఇంతలో ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ దొంగ పరుగులు తీశాడు. ఎవరికీ కనపడకుండా ఎక్కడ దాక్కోవాలో ఆలోచించాడు. ఎక్కడ దాక్కున్నా పోలీసులు పట్టేస్తారని, డ్రైనేజీలో దాక్కుంటే ఎవరూ గుర్తించలేరని అనుకున్నాడు.

అయినప్పటికీ అతడిని చాలా సులువుగా గుర్తించారు పోలీసులు. దొంగ ఆచూకీని కనిపెట్టడం కోసం పోలీసులు డ్రోను వాడారు. ఆ దొంగ దాక్కున్న డ్రైనేజీ మీదుగా డ్రోను వెళ్లింది. డ్రైనేజీకి మూత లేకపోవడంతో ఆ దొంగ డ్రోను కెమెరా కంటపడ్డాడు. దీంతో పోలీసులు ఆ డ్రైనేజీ వద్దకు వెళ్లారు. ఆ దొంగను పైకి రావాలని కోరారు.

ఆ దొంగ రాకపోవడంతో అందులోకి జాగిలాన్ని పంపే ప్రయత్నాలు చేశారు. దీంతో భయపడిపోయిన దొంగ పైకి వస్తానని చెప్పాడు. పోలీసులు అతడిని లాగి తీసుకెళ్లారు. మొదట ఆరోగ్య పరీక్షల నిమిత్తం అతడిని ఆసుపత్రికి పంపారు. ఈ ఘటన అమెరికాలోని ఫాయెట్ కౌంటీలో చోటుచేసుకుంది.

Scotland : ఆ స్కూల్లో ఎక్కువమంది కవలలే.. ఈసారి 17 సెట్ల కవలలు జాయిన్ అయ్యారు .. ఎక్కడంటే

ట్రెండింగ్ వార్తలు