భారత్ సంచలన నిర్ణయం.. అమెరికాకు ఆ సర్వీసులు సస్పెండ్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతదేశంపై 25 శాతం సుంకాన్ని విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు..(Suspension Of Services)

Suspension Of Services: రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నామనే సాకుతో భారత్ పై అమెరికా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తీరును ఇండియా సీరియస్ గానే తీసుకుంది. మీ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెప్పింది. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టం చేసింది.

తాజాగా అమెరికాకు భారత్ షాక్ ఇచ్చింది. అమెరికాకు పోస్టల్ సేవల్ నిలిపివేయనుంది.

ఈ నెల చివరలో అమల్లోకి వచ్చే US కస్టమ్స్ నిబంధనలలో మార్పులను పేర్కొంటూ ఆగస్టు 25 నుండి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ శనివారం ప్రకటించింది.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 14324ను అనుసరించి ఈ నిర్ణయం..

USD 800 వరకు విలువైన వస్తువులకు సుంకం-రహిత డి మినిమిస్ మినహాయింపును ఉపసంహరించుకుంటూ జూలై 30న US పరిపాలన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 14324ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకోబడింది.

మొత్తం సుంకాల భారం 50 శాతానికి పెరిగింది..

వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పోస్టల్ సేవలను నిలిపివేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతదేశంపై 25 శాతం సుంకాన్ని విధించారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా 25 శాతం జరిమానా విధించారు.

దీంతో మొత్తం సుంకాల భారం 50 శాతానికి పెరిగింది.(Suspension Of Services)

ఆగస్టు 29 నుండి అమలులోకి వచ్చే విధంగా, “అమెరికాకు ఉద్దేశించిన అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులు, వాటి విలువతో సంబంధం లేకుండా, దేశ-నిర్దిష్ట అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక శక్తి చట్టం (IEEPA) టారిఫ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం కస్టమ్స్ సుంకాలకు లోబడి ఉంటాయి” అని తపాలా శాఖ తెలిపింది.

అయితే, USD 100 వరకు విలువైన బహుమతి వస్తువులకు మినహాయింపు ఉంటుంది.

ట్రాన్స్ పోర్ట్ క్యారియర్స్ సుంకాలను వసూలు చేసి చెల్లించాల్సి ఉంటుంది..

కొత్త ఆర్డర్ ప్రకారం, అంతర్జాతీయ పోస్టల్ నెట్‌వర్క్ లేదా US కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఆమోదించిన ఇతర “అర్హత కలిగిన పార్టీలు” ద్వారా సరుకులను పంపిణీ చేసే ట్రాన్స్ పోర్ట్ క్యారియర్స్ సుంకాలను వసూలు చేసి చెల్లించాల్సి ఉంటుంది.

ఫలితంగా, అమెరికాకు వెళ్లే విమానయాన సంస్థలు ఆగస్టు 25 తర్వాత సరుకులను స్వీకరించలేమని భారత అధికారులకు తెలియజేశాయి.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, 2025 ఆగస్టు 25 నుండి USA కి ఉద్దేశించిన అన్ని రకాల పోస్టల్ వస్తువుల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని తపాలా శాఖ నిర్ణయించింది.

100 USD వరకు విలువైన లేఖలు,పత్రాలు, బహుమతి వస్తువులు తప్ప” అని పత్రికా ప్రకటనలో తెలిపింది.

కస్టమర్లు పోస్టేజ్ రీఫండ్ కోరవచ్చు..

డెలివరీ కాని వస్తువులను ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లు పోస్టేజ్ రీఫండ్ కోరవచ్చని ఆ విభాగం తెలిపింది.

“స్టేక్ హోల్డర్స్ తో సమన్వయంతో అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, వీలైనంత త్వరగా సేవలను నార్మలైజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని” కూడా తెలిపింది.

Also Read: మరో షాక్‌.. అనిల్ అంబానీ ఆర్‌కామ్‌పై రూ.2 వేల కోట్ల బ్యాంకు మోసం కేసు నమోదు చేసిన సీబీఐ.. ఆఫీసుల్లో తనిఖీలు