Hyderabad
Hyderabad : అమెరికాలో మరో భారతీయ విద్యార్ధి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ మరణం సంచలనం రేపుతోంది. అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
Gold Rate Today : భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడల్లో తులం బంగారం ధర ఎంతంటే?
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్ రెడ్డి బెనిగర్ ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్ధిగా ఉన్నాడు. శ్రేయాస్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాగా గురువారం శ్రేయాస్ రెడ్డి దురదృష్టవశాత్తూ మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. కానీ మరణానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఈ ఘటనపై న్యూయార్క్‌లోని ఇండియన్ మిషన్ విచారం వ్యక్తం చేసింది. శ్రేయాస్ మరణానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.
‘ఓహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్ధి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ దురదృష్టవశాత్తూ మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. పోలీసు విచారణ కొనసాగుతోంది. అతని మరణంపై ఎటువంటి అనుమానాలు లేవు. అతని కుటుంబం కాన్సులేట్‌తో టచ్‌లో ఉంది.’ అని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టింది. అయితే ఇలా ఈ ఏడాదిలో నలుగురు భారతీయ విద్యార్ధులు చనిపోయారు. ఈ వారంలోనే ఇది మూడవ ఘటనగా తెలుస్తోంది.
ఈ వారం ప్రారంభంలో షర్డ్యూ యూనివర్సిటీ విద్యార్ధి నీల్ ఆచార్య శవమై కనిపించాడు. ఆచార్య అదృశ్యమైనట్లు అతని తల్లి కంప్లైంట్ చేసిన కొన్ని గంటలకు యూనివర్సిటీ క్యాంపెస్‌లో అతని మృతదేహం గుర్తించారు. మరో కేసులో హర్యానాలోని పంచకుల నివాసి అయిన వివేక్ సైనీని జనవరి 16న జార్జియా లిథోనియాలో నిరాశ్రయుడైన వ్యక్తి కొట్టి చంపాడు. మరో భారతీయ విద్యార్ధి అకుల్ ధావన్ జనవరిలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ వెలుపల శవమై కనిపించాడు. యూఎస్ లో 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారు. కోవిడ్ తర్వాత 2 లక్షల మంది విద్యార్ధులకు US వీసాలు జారీ చేయబడ్డాయి. మానసిక ఒత్తిడి, ఒంటరితనం, డ్రగ్స్ వంటివి ప్రాణాంతకంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు.
Deeply saddened by the unfortunate demise of Mr. Shreyas Reddy Benigeri, a student of Indian origin in Ohio. Police investigation is underway. At this stage, foul play is not suspected.
The Consulate continues to remain in touch with the family and is extending all possible…
— India in New York (@IndiainNewYork) February 1, 2024