హార్ట్ బ్రేకింగ్ వీడియో: బాంబులకు భయపడలేదు.. పకపకా నవ్వేసిన చిన్నారి

  • Published By: vamsi ,Published On : February 19, 2020 / 07:47 AM IST
హార్ట్ బ్రేకింగ్ వీడియో: బాంబులకు భయపడలేదు.. పకపకా నవ్వేసిన చిన్నారి

Updated On : February 19, 2020 / 7:47 AM IST

అంతర్జాతీయ శక్తుల మధ్య ఆధిపత్య పోరాటానికి సిరియా రణస్థలంగా మారిపోయింది. అక్కడ నెలకొన్న పరిస్థితులపై అగ్రరాజ్యాలు ముఖ్యంగా అమెరికా, రష్యా స్పందిస్తున్న తీరు మూడు దశాబ్దాల క్రితంనాటి ప్రచ్ఛన్నయుద్ధ రోజులను గుర్తు తెప్పిస్తున్నాయి. మధ్యధరా సముద్రతీరంలో చమురు సంపన్న దేశమైన సిరియా అంతర్యుద్ధంతో నలిగిపోతోంది.  సిరియాపై పట్టుకోసం అగ్రరాజ్యాలు ఎత్తులకు పైఎత్తు ఆయుధాలతో ఆడుకుంటున్నాయి.

అయితే అంతర్యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో నివసించే బాధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేలుళ్ల శబ్ధాలు విన్నప్పుడు వారి గుండె ఎలా తట్టుకుంటుందా? అని తలచుకుంటేనే భయం వేస్తుంది. అటువంటి చోట మూడేళ్ల సిరియా అమ్మాయి ఏదైనా పేలుడు లేదా యుద్ధ విమానం శబ్ధం విన్నప్పుడు నవుతుంది. అలా నవ్వడం తండ్రే నేర్పించారు.  అలా ఓ బాండు పేలినప్పుడు చిన్నారి నవ్విన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అబ్దుల్లా మొహమ్మద్ అనే తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం అతని కుమార్తె సాల్వాతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించింది. అయితే భయపడాల్సిన సమయంలో ఆ చిన్నారి నవ్వడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మొహమ్మద్, తన కుమార్తెకు బాంబుల శబ్దం ఒక ఆటలో భాగమని చెప్పి భయపడకుండా చేసేందుకు ఇలా చేశాడు.

Read More>>సన్నటి మెట్లు ఎక్కేసిన స్మార్ట్ ఎలిఫెంట్ వైరల్ వీడియో