Afghanistan Taliban: బడిలో ఉగ్రవాదుల దాడి.. 16 మంది చిన్నారుల మృతి.. 24 మందికి గాయాలు
అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి కలకలం సృష్టించారు. ఓ బడిలో బాంబు దాడికి పాల్పడి 16 మంది చిన్నారుల ప్రాణాలు తీశారు. మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర అఫ్గానిస్థాన్ లోని అయ్‌బాక్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తాలిబన్ సర్కారు అధికారులు ఓ ప్రకటన చేశారు. అయితే, మతపర అంశాలు బోధించే ఆ బడిలో ఎవరు ఈ దాడికి పాల్పడ్డారన్న విషయంపై వివరాలు తెలియరాలేదు.
- T Venkateshwarlu
- Published On : November 30, 2022 / 05:13 PM IST
Afghanistan Taliban
Afghanistan Taliban: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి కలకలం సృష్టించారు. ఓ బడిలో బాంబు దాడికి పాల్పడి 16 మంది చిన్నారుల ప్రాణాలు తీశారు. మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర అఫ్గానిస్థాన్ లోని అయ్‌బాక్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తాలిబన్ సర్కారు అధికారులు ఓ ప్రకటన చేశారు. అయితే, మతపర అంశాలు బోధించే ఆ బడిలో ఎవరు ఈ దాడికి పాల్పడ్డారన్న విషయంపై వివరాలు తెలియరాలేదు.
ఈ దాడికి బాధ్యతవహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరిగినప్పటి నుంచి ఆ దేశంలో తాలిబన్ల పాలన మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అఫ్గాన్ లో పదే పదే దాడులు జరుగుతున్నాయి.
New Zealand vs India: మూడో వన్డే వర్షార్పణం.. 1-0 తేడాతో భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్
ఆకలి కేకలు, తాలిబన్ల ఆంక్షలు, స్వేచ్ఛ లేకపోవడం, ఉపాధి కరవవడంతో పాటు మరోవైపు ఉగ్రవాదులతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తమ పంతాన్ని నెరవేర్చుకోవడానికి చిన్నారులను కూడా లక్ష్యంగా చేసుకుని పలు ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడులకు తెగబడుతూ కలకలం రేపుతున్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
