New Zealand vs India: మూడో వన్డే వర్షార్పణం.. 1-0 తేడాతో భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్

భారత్-న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్ లోని హాగ్లీ ఓవల్ లో జరిగిన మూడో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. నేటి వన్డేను రద్దు చేశారు. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

New Zealand vs India: మూడో వన్డే వర్షార్పణం.. 1-0 తేడాతో భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్

New Zealand vs India

New Zealand vs India: భారత్-న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్ లోని హాగ్లీ ఓవల్ లో జరిగిన మూడో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. నేటి వన్డేను రద్దు చేశారు. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఫిన్ అల్లెన్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

డెవోన్ కాన్వే 38 (నాటౌట్), కానె విలియమ్సన్ 0(నాటౌట్) పరుగులు తీశారు. అనంతరం వర్షం పడింది. భారత బ్యాట్స్‌మెన్ లో శిఖర్ ధావన్ 28, శుభ్‌మన్ గిల్ 13, శ్రేయాస్ అయ్యర్ 49, రిషబ్ పంత్ 10, సూర్యకుమార్ యాదవ్ 6, దీపక్ హూడా 12, వాషింగ్టన్ సుందర్ 51, దీపక్ చాహర్ 12, యజువేంద్ర చాహెల్ 8, అర్ష్‌దీప్ సింగ్ 9, ఉమ్రాన్ మాలిక్ 0 (నాటౌట్) పరుగులు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా టామ్ లాథమ్ నిలిచాడు.

ఎక్స్‌ట్రాల రూపంలో భారత్ కు 21 పరుగులు దక్కాయి. దీంతో 219 పరుగులు చేసింది. న్యూజిలాండ్ పర్యటనలో భారత్ టీ20 సిరీస్ ను గెలుచుకుంది. వన్డేల్లో మాత్రం పూర్తిగా విఫలమైంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..